పేదలకు అన్యాయం జరిగితే సహించేది లేదు..... సచివాలయం,వాలంటీర్ వ్యవస్థ పై యమ్ ఎల్ ఎ పర్వత  ఫైర్..

పేదలకు అన్యాయం జరిగితే సహించేది లేదు.....

సచివాలయం,వాలంటీర్ వ్యవస్థ పై యమ్ ఎల్ ఎ పర్వత  ఫైర్..

  శంఖవరం, అక్షర లీడర్: రాష్ట్ర ప్రభుత్వం  ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు లో నిర్లక్ష్యంగా వ్యవహరించి స్వప్రయోజనాల కోసం వాటిని వాడుకుంటే ఎవరినైనా సరే సహించేది లేదని ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు పర్వత ప్రసాద్ అన్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సచివాలయ ఉద్యోగులు అలాగే వాలంటీర్లు ప్రభుత్వ పథకాలలో పొరపాట్లు చేస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. వీరిపై ప్రస్తుతం ఎంక్వయిరీ  జరుగుతుందన్నారు.ముఖ్యమంత్రి ఏ ఆశయం కోసం వీరందరికీ ఉద్యోగాలు ఇప్పించారో వాటికి కట్టుబడి పనిచేయాలన్నారు. ముఖ్యంగా పేద ప్రజల విషయంలో అన్యాయం జరిగితే మాత్రం సహించబోమని తేల్చి చెప్పారు.గ్రామ గ్రామాన అధికారులు ఏం చేస్తున్నారో వైసీపీ కార్యకర్తల ద్వారా నిరంతరం తెలుసుకుంటానని, అధికారి అనే వారు ఎవరైనా తప్పుచేస్తే కచ్చితంగా సంబంధిత అధికారుల దృష్టి లో ఉంచి చర్యలు తీసుకునేలా చేస్తామన్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు