వరినారు మడులు సస్యరక్షణ చర్యలు
తూర్పు గోదావరి ;జిల్లాలో గత నాలుగు రోజులనుండి కురుస్తున్న అధిక వర్షాలకు కొన్ని లోతట్టు ప్రాంతాల్లో వ్యవసాయ పంటలు ముంపుకు గురి అవ్వటం జరుగుచున్నది. కాబట్టి రైతులందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినది గా జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు కే.ఎస్.వి.ప్రసాద్ తెలియజేయు చున్నారు. జిల్లా ఇప్పటివరకు 70% వరి ఆకుమడులు వేయడమైనది. అలాగే 12 నుండి 13 శాతం వరి నాట్లు పూర్తి అయ్యాయి . నాలుగు రోజులనుండి కురుస్తున్న వర్షాలకు ఆకుమడులు ముంపుకు గురి అవుతున్నాయి కనుక రైతులందరూ వర్షం తగ్గిన వెంటనే పొలం లో నీటిని తీసివేసి ఆరుదల పెట్టవలెను. 5 సెంట్ల ఆకుమడికి 2 కేజీల నత్రజని & 1కేజీ పోటాష్ వేయవలెను.. దీనివలన ఆకుమడి తొందరగా కోలుకోవటం జరుగుతుంది. ఇంకా తేమ శాతం యెక్కువ గా ఉండటం వలన చీడ పీడలు ఆశించే అవకాశం ఉంటుంది కనుక ,20 రోజుల వయసున్న ఆకునుడికి ఒక లీటర్ నీటికి 2 మీ.లీ క్లోరిఫైరిఫోస్ మరియు 1 గ్రాము బావిస్టన్ కలిపి పిచికారి చేయవలెను.ఇంకా ప్రదాన పొలంలో నీరు తీసివేయ వలెను కాలి బాటలు తీసి పొలం ఆరేటట్లు చేయవలెను.తరువాత పై పాటుగా 1 ఏకరాకి 20 కేజీల యూరియ &15కేజీల పోటాష్ కలిపి ఏకరా ప్రధాన పొలానికి వేయాలి . దీనివలన చీడ పీడలు ఆశించకుండా ఉండటం జరుగుతుంది. జిల్లాలోని అందరు రైతులు ఈ జాగ్రత్తలు పాటించి తమ పంటలను రక్షించుకోవాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి