భారత ప్రభుత్వంచే పద్మ అవార్డులకు దరఖాస్తులు

                                                                                                    తూర్పుగోదావరి ;క్రీడలలో ఉత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులు, క్రీడా రంగానికి విశేష సేవలు అందజేసిన వ్యక్తులకు భారత ప్రభుత్వం 2021 సంవత్సరాని అందజేసే పద్మ అవార్డుల కొరకు వ్యక్తిగతంగా ధరఖాస్తు చేసుకోదలచిన అర్హులైన క్రీడాకారులు 2020 ఆగష్టు 15వ తేదీలోపున తమ ధరఖాస్తులను www.padmaawards.gov.in  వెబ్ సైట్ ద్వారా సమర్పించాలని  జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి డా. ఎస్.రామమోహన్ తెలిపారు.అలాగే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించే క్రీడాకారులు తమ ధరఖాస్తును word & PDF ఫార్మాట్లలో మెయిల్ అడ్రసు managers-saap@ap.gov.in  ఆగష్టు 15 వ తేదీ లోపు సమర్పించాల్సి ఉంటుందన్నారు.  ఇందుకు నిర్థేశించిన ధరఖాస్తు, ఇతర వివరాలను అభ్యర్థులు www.padmaawards.gov.in వెబ్ సైట్ నుండి పొందవచ్చనని తెలియజేశారు. ఆగష్టు 15 తదుపరి ధరఖాస్తుల స్వీకరణ ఉండదని,జిల్లాలోని అర్హులైన క్రీడాకారులు సకాలంలో ధరఖాస్తు చేసుకోవాలని సిఈఓ రామమోహన్ కోరారు.   


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు