హరిత కాకినాడగా తీర్చి దిద్దేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి
తూర్పు గోదావరి ;నగర ప్రజలు కాకినాడను హరిత కాకినాడగా తీర్చి దిద్దేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత అన్నారు. మంగళవారం కాకినాడ జన్మభూమి పార్కు వద్ద కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనం-మనం పధకంలో భాగంగా ఉచిత మొక్కల పంపిణీ కార్యక్రమానికి ఎమ్.పి వంగాగీత, కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ మేయర్ సుంకర పావని, కమీషనర్ స్వప్నిల్ దినకర పుండ్కర్ ముఖ్య అతిధి లుగా పాల్గొని మొక్కలు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఎమ్.పి మాట్లాడుతూ కాకినాడను హరిత కాకినాడగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు. అదే విధంగా ఒక మొక్కను దత్తత తీసుకుని వాటిని సంరక్షించే భాద్యతను తీసుకుంటే కాకినాడ పరిసరప్రాంతాలు పచ్చదనంతో నిండుకుంటాయని ఎమ్.పి తెలిపారు. సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నగరవాసులు ప్రతి ఒక్కరు మొక్కులు నాటి పర్యావరణ మిత్రులుగా మారాలన్నారు. అందరు విధి గా స్వచ్చంధంగా మొక్కలు నాటడానికి ఆసక్తి చూపించాలని ఆయన తెలిపారు. కమీషనర్ స్వప్నిల్ దినకర పుండ్కర్ మాట్లాడుతూ వనం-మనం కార్యక్రమంలో భాగంగా ఉచితంగా మొక్కల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 25 వేల మొక్కలు ఉచితంగా పంపిణీ చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించగా ఇప్పటికే సుమారు 15 వేల మొక్కలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇంటి ఆవరణంలో పెంచుకొనుటకు వీలుగా మరియు పోషక విలువలు కలిగిన జావు, దానిమ్మ, కొబ్బరి, ప్రూట్ క్రాప్ వంటి మొక్కలు ఉచితంగా నగరవాసులకు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా బొగడ, కోనాకార్పస్ వంటి మొక్కలు రోడ్ల మార్జ్ నందు పెంచడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నల్లబిలి సుజాత, ఉద్యానవన సహాయ సంచాలకులు టి.విరా సీరిల్, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి