రాష్ట్ర రహదాలు మరియు భవనాల శాఖ మాత్యులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన మంత్రి శంకరనారాయణ

రూ. 6,400 కోట్ల వ్యయంతో 3,104 కి.మి పోడవు గల రహదారుల నిర్మాణాలకు తొలి సంతకం

రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి  ప్రత్యేక ధన్యవాదాలు

మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ

 

తూర్పు గోదావరి జిల్లాలోని యెదురులంక - జి. మూల్లపాలెం రహదారికి 10/140 కీ.మీ.లో అక్షరాల 76.90 కోట్ల రూపాయల వ్యయంతో, జ.మూల్లపాలెం వద్ద గోదావరి నది, వృధ్ధ గౌతమి బ్రాంచ్ కెనాల్ మీదుగా కొత్త వంతెన నిర్మాణ పనులకు మరియు మండల కేంద్రముల అనుసంధానం మరియు గ్రామీణ రహదారుల అనుసంధానములను మెరుగుపరచడానికి దాదాపు 3,104 కిలోమీటర్ల పొడవు గల రహదారులను రూ. 6,400 కోట్ల వ్యయంతో రెండు ప్రాజెక్టుల క్రింద న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (NBD) ఆర్థిక సహాయంతో చేపట్టబోవు పనులకు మొదటి సంతకం చేశారు.

అమరావతి ;ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మాత్యులుగా  మాలగుండ్ల శంకరనారాయణ  పదవీ స్వీకారం చేశారు. బుధవారం, అమరావతి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరంమాలగుండ్ల శంకరనారాయణ  రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మాత్యులుగా పగ్గాలు అందుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 

 

ఈ సందర్భంగా మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మాత్యులుగా పదవీ భాద్యతలు చేపట్టినట్లు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టి స్థాపించిన నాటి నుండి జగనన్నతో ప్రయాణం చేస్తూ పార్టీ అభివృద్ధికి, పార్టీ కార్యక్రమాల అమలుకు ముఖ్య పాత్ర ఇచ్చి గత పది సంవత్సరాలుగా అనంతపురం జిల్లాకు అధ్యక్షునిగా పూర్తి భాద్యతలు ఇచ్చి పార్టీ అభివృద్ధిలో భాగస్వామ్యులుగా చేయడమే కాక ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొట్టమొదటి సారిగా శాసన సభ్యునిగా గెలిచిన తర్వాత బిసి సంక్షేమ శాఖ మంత్రిగా పదవిని ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

 

రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మాత్యులుగా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తన మొదటి సంతకంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని యెదురులంక - జి. మూల్లపాలెం రహదారికి 10/140 కీ.మీ.లో అక్షరాల 76.90 కోట్ల రూపాయల వ్యయంతో, జ.మూల్లపాలెం వద్ద గోదావరి నది, వృధ్ధ గౌతమి బ్రాంచ్ కెనాల్ మీదుగా కొత్త వంతెన నిర్మాణ పనులకు మరియు మండల కేంద్రముల అనుసంధానం మరియు గ్రామీణ రహదారుల అనుసంధానములను మెరుగుపరచడానికి దాదాపు 3,104 కిలోమీటర్ల పొడవు గల రహదారులను రూ. 6,400 కోట్ల వ్యయంతో రెండు ప్రాజెక్టుల క్రింద న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (NBD) ఆర్థిక సహాయంతో చేపట్టబోవు పనులకు మొదటి సంతకం చేశారు. రానున్న రెండేళ్ళలో ఈ వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 

 

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు