కాకినాడ పటణంలో గల కంటెన్మెంట్ జోన్లలో కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత

మంగవారం కాకినాడ పటణంలో గల కంటెన్మెంట్ జోన్లను కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత, జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి, ఎస్.పి అద్నాం నయీం అస్మీ, కాకినాడ సిటీ శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ కమీషనర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ లతో కలిసి పర్యటించారు. కాకినాడ పటణంలో స్థానిక 25 వార్డు నందు గల రిక్షాల పేట, 14వ వార్డు నందుగల ఏటి మొగ తిలక్ వీధి మరియు 30వార్డు గల శివాలయం రెడ్ జోన్ ప్రాంతాల్లో కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత, జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి, ఎస్.పి అద్నాం నయీం అస్మీ, కాకినాడ సిటీ శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ కమీషనర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ లతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ పటణంలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న ప్రాంతాల్లో పల్స్ ఆక్సిమీటర్ ద్వారా ఆక్సిజన్ శాతం 94శాతం తక్కవ కలిగిన వారికి ముఖ్యంగా 40సంవత్సరాలు పై బడిన వారికి రాపిడ్ ఆంటింజన్ కరోనా టెస్లు కిట్లను ఉపయోగించి వెంటనే ఫలితాలు ఇవ్వడాన్ని కలక్టర్ ఈ సందర్బంగా పరిశీలించారు. కరోనా పాజిటీవ్ సంబంధితులైన ప్రైమరి, సెకండ్రీ కాంటాక్ట్ అయిన వారు గృహ నిర్బంధంలోనే ఉండాలని కలక్టర్ సూచించారు. ఈ పర్యటనలో కలక్టర్ వెంబడి అడిషనల్ కమీషనర్ సిహెచ్.నాగనరసింహరావు, డిప్యూటీ కమీషర్ సిహెచ్.సత్యనారాయణ, ఎమ్ఎ ఓ డా.పి.ప్రశాంత, అర్బన్ తాహసిల్దార్ వై హెచ్ ఎస్ సతీష్, తదితరులు పాల్గొన్నారు. 


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు