
ఐ. పోలవరం, అక్షర లీడర్: ఐ.పోలవరం మండలం మురమళ్ల గ్రామం లో మాణిక్యాంబ నగర్, వి ఐ పి కాలనీ లలో కరోనా వైరస్ ప్రభావం చడంతో ఆయా ప్రాంతాలను రెడ్ జోన్లుగా అధికారులు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న కారణాల చేత ఆ ప్రాంతాలను కంటెంట్మెంట్ జోన్లుగా ప్రకటించడం జరిగిందని మురమళ్ళ పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. అదేవిధంగా చెయ్యే టి వారి పేట, మట్టపర్తి వారి పాలెం ఆ ప్రాంతాలలో కూడా కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటించడం జరిగిందని ప్రసాద్ తెలిపారు. అయితే ఈ ప్రాంతాల్లో ఉన్న బాధితులను హోమ్ కరెంట్ టైం లో ఉంచటం జరిగిందని అన్నారు. ఆయా పరిసర ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదిక మురమళ్ళ గ్రామ కార్యదర్శి బ్లీచింగ్, శానిటైజర్, తక్షణమే జల్లించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి, తరచూ శానిటైజర్ సూపర్ తీసుకోవాలని మన ఆరోగ్యం అందరి ఆరోగ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి