కరోనా సోకినట్లు గుర్తించి వైద్య సేవలు పొందితే మంచి ఫలితాలు
కరోనా లక్షణాలు వున్నవారు సకాలంలో తనకు కరోనా సోకినట్లు గుర్తించి వైద్య సేవలు పొందితే మంచి ఫలితాలు వస్తున్నాయని గృహనిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ తెలిపారు. గురువారం ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డిలతో కలిసి కాకినాడ కలక్టరేట్ కార్యాలయంలో జాయింట్ కలక్టర్లు, వైద్యాధికారులు, ఇండియన్ మెడికల్ అసోషియేషన్ ప్రతినిధులతో జిల్లాలో కోవిడ్ - 19 పై పరీక్షలు జరుగుతున్న తీరు, ఆసుపత్రుల నిర్వహణ పై తీసుకొంటున్న చర్యల పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ కరోనా వ్యాధి లక్షణాలు వుండి సకాలంలో వైద్య సేవలు పొందక పోవడం వలన అనర్థాలు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో కోవిడ్ పరీక్షలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని కరోనా లక్షణాలు వున్నవారు ఎటువంటి భయాందోళనలు లేకుండా పరీక్షలు చేయించుకోవాలన్నారు. కరోనా పరీక్షల్లో తనకు నేగిటీవ్ వచ్చిందనే అపోహతో నిబంధనలు అతిక్రమిస్తే తనతో పాటు సమాజపరంగా అనర్ధాలు జరిగే అవకాశం వుందన్నారు. మాస్ ధరించడంతో పాటు చేతులు శుభ్రంగా కడుగుకోవడం, సామాజిక దూరం తప్పని సరిగా పాటించాలన్నారు. జిల్లా కోవిడ్ నియంత్రకు చేపడుతున్న కార్యక్రమాలు సంతృప్తికరంగా వున్నాయని వీటిని మరింతగా పర్యావేక్షించాలన్నారు. బొమ్మూరులో ఏర్పాటు చేసిన కోవిడ్ కేంద్రం (సిసిసి) నిర్వహణ బాగుందని అధికారులు, డాక్టర్లు రోజు వారి తనిఖీలు చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ అధికారులకు, వైద్యులకు పలుసూచనలు చేసారు. కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి కోవిడ్ నియంత్రణకు చేపడుతున్న వివిధ అంశాలను ప్రన్సిపల్ సెక్రటరీకి వివరించారు. ఈ సమావేశంలో జెసి(డి) కీర్తి చేకూరి, జెసి(డబ్ల్యూ) జి.రాజకుమారి జిల్లాలో కోవిడ్ - 19 నియంత్రణకు చేపడుతున్న పరిస్థితులను అజయ్ జైన్ కు వివరించారు. అనంతరం జిల్లాలో కోవిడ్ - 19 హోమ్ ఐసోలేషన్ వుంటున్న వారికి ఇస్తున్న కిట్స్ ను ఈ సందర్బంగా అజయ్ జైన్ పరిశీలించారు. ఈ సమావేశంలో డిఆర్ ఓ సిహచ్.సత్తిబాబు, డిఎమ్ అండ్ హెచ్ ఓ డా.మల్లిఖార్జున్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.మణిరత్నకిషోర్, ఐఎమ్ డాక్టర్ల ప్రెసిడెంట్ వాడ్రేవు రవి, నర్సింగ్ హోమ్ ఐసోలేషన్ ప్రెసిడెంట్ డా కిరణ్, డా.డిఎస్ మూర్తి, ఇతర అధికారులు, తదితరులు పాల్లో న్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి