కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో 311 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 311 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది.                                                                                                                                                         https://eastgodavari.ap.gov.in/ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ వెలువడింది. స్టాఫ్ నర్స్, రిసిప్షనిస్ట్ కమ్ క్లర్క్, ల్యాబ్ టెక్నీషియన్ లాంటి పోస్టులున్నాయి. ఇవి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టులు. ఆసక్తి గల అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 జూలై 18 చివరి తేదీ.


చైల్డ్ సైకాలజిస్ట్- 1
రిసిప్షనిస్ట్ కమ్ క్లర్క్- 3
స్టాఫ్ నర్స్- 28+250
ల్యాబ్ టెక్నీషియన్- 04ఫార్మాసిస్ట్- 2
డార్క్ రూమ్ అసిస్టెంట్- 1
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్- 2
మేల్ నర్సింగ్ ఆర్డర్లీ- 10
ఫీమేల్ నర్స్ ఆర్డర్లీ- 10


దరఖాస్తు ప్రారంభం- 2020 జూలై 8
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 18
ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్- 2020 జూలై 30
ఫైనల్ మెరిట్ లిస్ట్- 2020 ఆగస్ట్ 4
డాక్యుమెంట్ వెరిఫికేషన్- 2020 ఆగస్ట్ 5 నుంచి 7
అపాయింటింగ్ ఆర్డర్స్- 2020 ఆగస్ట్ 12


విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు ఫీజు- రూ.300
దరఖాస్తులు సబ్మిట్ చేయాల్సిన అడ్రస్:
Superintendent,
Government General Hospital,
Kakinada,
East Godavari District,
Andhra Pradesh.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు