నూతన విద్యాసంవత్సరానికి (2020-21) మైనారిటీ విద్యార్థులకు స్కాలర్ షిప్పులకు సంబంధించి రిజిష్టర్
నూతన విద్యాసంవత్సరానికి (2020-21) మైనారిటీ విద్యార్థులకు భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన (GOI Schlorships) ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, మెరిట్ కం మీన్స్ స్కాలర్ షిప్పులకు సంబంధించి రిజిష్టర్ కాని ఆయా విద్యాసంస్థలు తమ లాగిస్ ద్వారా జులై 20వ తేదీలోగా (ఈ-కేవైసీ) దరఖాస్తు చేసుకోవలెను ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల, కళాశాల యాజమాన్యం, ప్రభుత్వ విద్యాసంస్థలు మైనారిటీస్ (ముస్లిం, క్రిస్టియన్లు, బౌద్ధులు, సిక్కులు, పార్సికులు) విద్యార్థులు స్కాలర్ షిప్పుకు దరఖాస్తు చేసుకునేందుకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ https://scholarships.gov.in వెబ్ సైట్ లో ఇస్టిట్యూట్ లాగిస్ లో నమోదు చేసుకోవలెను. ఆయా విద్యాసంస్థలు పూరించిన ఈ-కేవైసీ దరఖాస్తు ( ఆలైస్ రిజిస్ట్రేషన్ ఫాం)ను ప్రింట్ తీసుకొని నోడల్ అధికారి అయిన (పాఠశాల, కళాశాల హెడ్ మాస్టర్, ప్రిన్సిపల్) ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని జతపరిచి సంతకం చేసి సంబంధిత విద్యాసంస్థల సిబ్బంది వారు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయానికి అందజేయ వలెను.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి