- - జూలై 20 నుండి ఆగష్టు 7 వరకు పంట సాగు హక్కు పత్రాల జారీ కై ప్రత్యేక డ్రైవ్
- - జూలై 20 నుండి ఆగష్టు 7 వరకు పంట సాగు హక్కు పత్రాల జారీ కై ప్రత్యేక డ్రైవ్ - - ఆర్.బి. కే ల ద్వారా పంట సాగు హక్కు పత్రాల జారీకి సంబంధిత శాఖలతో సమన్వయం -- జెసి జి.లక్ష్మీశ జిల్లాలో జూలై 20 నుండి ఆగష్టు 7 వరకు పంట సాగు హక్కు పత్రాల జారీ కై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. సోమవారం జాయింట్ కలక్టర్ తన కార్యాలయం నుండి వ్యవసాయం, రెవెన్యూ, పశుసంవర్థక, మత్స్య, బ్యాంకింగ్ సంబంధిత శాఖ అధికారులతో పంటసాగు హక్కు పత్రం పై జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జిల్లాలో కౌలు రైతులకు భరోసా కల్పించే దిశగా వ్యవసాయం వాటి అనుబంధ రంగాలు, రెవెన్యూ, బ్యాంకర్లతో సమన్వయం చేస్తూ పంటసాగు పత్రాలను జారీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఒక షెడ్యూల్ ప్రకారం ఈ సదస్సు మద్యాహ్నం సమయంలో ఏర్పాటు చేస్తారన్నారు. ఈ సదస్సుల్లో వ్యవసాయ సిబ్బందితో పాటు పశుసంవర్ధక శాఖ, మత్స్య, రెవెన్యూ, బ్యాంకు అధికారులు పాల్గొంటారన్నారు. పశుసంవర్థక, మత్స్య శాఖాధి కారులు రైతులకు కిసాన్ క్రెడెడ్ కార్డులు ఈ సదస్సులో ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పటికే జిల్లాలో 52వేల 537 కౌలు రైతు కార్డులను ఇవ్వడం జరిగిందన్నారు. కౌలు దారులకు కార్డులు ఇవ్వడంతో పాటు రుణసదుపాయం కల్పించాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో 15వేల 569మంది కౌలు రైతులకు 59.86కోట్ల రూ.లు పంట రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. పంట సాగుదారు-పత్రం పొందేందుకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు జాయింట్ కలక్టర్ ( రెవెన్యూ) జి.లక్ష్మీశ తెలిపారు. కౌలు రైతులకు సాగు దారు హక్కు పత్రం అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినందున తదనుగుణంగా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సాగుదారుహక్కు పత్రం పొందడానికి భూ యాజమాని, సాగుదారు, స్థానిక విఆర్ఓలు సంతకాలు చేస్తే సరిపోతుందన్నారు. ధరఖాస్తు చేసుకొన్న 3రోజులలో ఈ పత్రం పొందవచ్చన్నారు. భూయాజమాని, రైతు విదేశాలలో గాని, ఇతర రాష్ట్రంలో వుంటే ఎలక్ట్రానిక్ పద్దతిలో విఆర్ ఓ ద్వారా పొందవచ్చునన్నారు. ఈ పత్రాన్ని 3 నుండి 11 నెలల కాల పరిమితిలో రెవెన్యూవల్ చేసుకొనే సదుపాయం వుందన్నారు. సాగుదారు ఈ పత్రాన్ని 3 నుండి 11 నెలల కాల పరిమితిలో రెవెన్యూవల్ చేసుకొనే సదుపాయం వుందన్నారు. సాగుదారు హక్కు పత్రం 11 నెలల పాటు పని చేస్తుందన్నారు. సాగుదారులు పంటరుణాలు, ప్రభుత్వం అందించే ఉచిత పంటల భీమా, ఇన్ పుట్ సబ్సిడీ, ఇతర రాయిలతో పాటు పంట నష్టము, ప్రకృతి వైపరీత్యాలు సంబంవించినప్పుడు రాయితీలు పొందుటకు సాగుదారు హక్కు పత్రం ఉపయోగపడుతున్నాయి. అసలు భూమిలేని కౌలు రైతులు, ఎస్.సి, ఎస్.టి, బిసి, మైనారిటీ కులాలకు చెందిన వారైతే తమ పేర్లను వైఎస్ఆర్ రైతుభరోసా పోల్డర్ లో ప్రతి సంవత్సరం జూలై నెలాఖరువు లోపు నమోదు చేసుకొంటే రైతు భరోసా సొమ్ము జమ అవుతుందన్నారు. ఈ పత్రం ఇవ్వడం ద్వారా భూయాజమానికి ఎటువంటి నష్టం ఉండదని, పైగా భూయాజమానితో పాటు కౌలు రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా సొమ్ము వస్తుందన్నారు. పంట సాగుదారు హక్కు పత్రం పైన భూయాజమాని సంతకం చేయడం ద్వారా కౌలుదారునికి పంటసాగుదారు హక్క చట్టం 2019 సెక్షన్ 5(బి) ప్రకారం కాల వ్యవధిలో పండిన పంట పై మాత్రమే హక్కు కల్పించడం జరుగుతుందనీ భూమి యొక్క యాజమాన్యపు హక్కు ఎటువంటి భంగం కలగదన్నారు. ఈ పత్రం ఆధారంగా రెవెన్యూ అధికారి భూయాజమాని భూమిని బదలాయించే అవకాశం లేదని, ఈ ఒప్పందం రెవెన్యూ రికార్డులలో నమోదు కాబడదన్నారు. ఈ పత్రం పై ప్రభుత్వరంగం బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల ద్వారా సాగుదారు పొందన భూమి నిర్నిత సమయంలో తిరిగి చెల్లించనీ ఎడల భూయాజమాని ఆ సోమ్ము పై ఎటువంటి భాద్యత వుండదని, పంట బుణం యొక్క పూర్తి భాద్యత సాగుదారుడుదే అన్నారు. ఒక వేళ భూమికి నష్టము కలిగించే విధంగా ఏమైన చర్యలు చేపడితే భూయాజమానితో కుదిరిన ఒప్పందం రద్దు చేసుకోవచ్చన్నారు. సాగుదారుహక్కు పత్రం పొందిన రైతు తిరిగి వేరే రైతుకు సాగుకు ఇచ్చే వీలు పడదన్నారు. ఆంధ్రప్రదేశ్ కౌలుదారీ చట్టం 1956 ప్రకారం కౌలు రైతులకు కొన్న హక్కులు కల్పించడం ద్వారా భూయాజమానులు తమ భూములను కౌలుకు ఇవ్వడంలో వెనుకంజ వేస్తున్న దృష్టి ప్రభుత్వం 1956 చట్టాన్ని రద్దు చేసి పంట సాగు హక్కు చట్టం 2019 ను తీసుకొని వచ్చారన్నారు. కౌలు దారులకు మేలు జరి గే విధంగా భూ యాజమానులు తమ భూమి హక్కులు కోల్పో కుండా పంట సాగు పత్రం జారీ చేసే విధంగా చేపడుతున్న కార్యక్రమంలో భూయాజమాని ముందుకు వచ్చే విధంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెసి క్షేత్రస్థాయి అధికారులకు పలు సూచనలు చేసారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి