కోవిడ్-19 నియంత్రణ పై తీసుకొంటున్న చర్యల పై జిల్లా కలక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం తాడేపల్లి ఆయన క్యాంప్ కార్యాలయం నుండి రాష్ట్రంలో కోవిడ్-19 నియంత్రణ పై తీసుకొంటున్న చర్యల పై జిల్లా కలక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అదే విధంగా వర్షాకాలం సీజనల్ వ్యాధుల పై చేపట్టవలసిన అంశాలతో పాటు పట్టాల పంపిణీ, మొక్కలు నాటడం, ఇసుక, ఉపాధిహామీ పనులు, నాడు-నేడు, వ్యవసాయం పై జిల్లాకలకర్లతో సమీక్షించారు. కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి తన కార్యాలయపు వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా ఎస్.పి అద్నామ్ నాయీం అస్మీలతో పాటు జాయింట్ కలక్టర్లు జి.లక్ష్మీశ, కీర్తి చేకూరి, జి.రాజకుమారి, డిఆర్ ఓ సిహెచ్.సత్తిబాబు లతో కలిసి పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు