కోవిడ్ ఆసుపత్రులలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు

కాకినాడ.;జిల్లా కలక్టరు వారి ఆదేశముల ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలోని Covid-19 ఆసుపత్రిలో ఎమ్.ఎన్.ఓ., ఎఫ్.ఎన్.ఓ. మరియు స్వీపర్లు గా 'వికాస' ద్వారా అవుట్ సోర్సింగ్ పద్దతిలో తాత్కాలికంగా పనిచేయుటకు గాను ఈ క్రింది విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు కావలెను. విధ్యార్హతలు:A. : ఎమ్.ఎన్.ఓ.. : ఎస్.ఎస్.సి., + ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ B. ఎఫ్.ఎన్.ఓ, ఎస్.ఎస్.సి., + ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ C. స్వీపర్ చదువుట మరియు రాయుట పై అర్హతలున్న అభ్యర్ధులు తాత్కాలిక ప్రాతిపదికన తూర్పు గోదావరి జిల్లాలో Covid-19 ఆసుపత్రిలో ఎమ్.ఎన్.ఓ., ఎఫ్.ఎన్.ఓ. మరియు స్వీపర్లు గా పనిచేయుటకు ధరఖాస్తు పూర్తి (పేరు, తండ్రి పేరు, కమ్యూనిటి, విధ్యార్హతలు, అడ్రస్, కాంటాక్ట్ నెంబరు మొదలగు) వివరములతో కూడిన దరఖాస్తును, మరియు విద్యార్హతలకు సంబంధించిన జిరాక్స్ కాపీలను కాకినాడ కలక్టరేట్ నందు గల 'వికాస' కార్యాలయమునకు తేది. 31-07-2020 నుండి తేది. 02-07-2020 (ఉదయం 10 గం.ల నుండి సాయంత్రం 5 గం..ల వరకూ) వరకూ నేరుగా వచ్చి ఇవ్వవలసినదిగా కోరుచున్నాము.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు