రైతు భరోసా కేంద్రాల్లో రైతులు రిజస్టర్ వేగంగా చెయ్యాలి
తూర్పు గోదావరి ;;ది.18.6.2020 కాకినాడ వ్యవసాయ సంయుక్త సంచాలకుల వారి కార్యాలయంలో డివిజిన్ స్తాయి వ్యవసాయ సహాయ సంచాలకులకు సమావేశం నిర్వహించట మైనది .ఈ కార్యక్రమానికి జిల్లా సంయుక్త కలెక్టర్ (రెవిన్యూ &వ్యవసాయం) లక్ష్మీశ గారు విచ్చేసి అధికారులందరికీ పలు సూచనలు చేయడమైనది. ముఖ్యం గా సచివాలయ పరిధిలోని 1129 రైతు భరోసా కేంద్రాలలో రైతులందరూ కూడా రిజిస్టర్ అయ్యే విధం గా అందరు రైతులకు తెలియచేయాలని. జిల్లాలో సాగు చేసే ప్రతి కౌలు రైతు కూడా పంట సాగు హక్కు పత్రం పొందే విధంగా వ్యవసాయ శాఖ పనిచేయాలని, ఇంకా రైతులకు పంట సాగు హక్కు పత్రం ఉద్దేశం ,దానివలన కౌలు రైతుకు కలుగు ప్రయాజనాల పై రైతులకు అవగాహన కల్పించాలని , రైతు భరోసా కేంద్రాలలో కియోస్క్ లు పని చేసే విధానం ,అన్నింటి గురించి రైతులకు అవగాహన కల్పించాలని, వాటిపై గ్రామ స్తాయిలో శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఇంకా జిల్లా బయోలాజికల్ కంట్రోల్ ల్యాబ్ ను పరిశీలించటం జరిగింది. ఈ కార్య క్రమములో జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు కే.ఎస్.వి.ప్రసాద్, ఉప సంచాలకులు, వి.టి.రామా రావు, ఎస్.మాధవ రావు, పి.డి. ఆత్మ, శ్రీమతి సునీత గారు, రైతు శిక్షణా కేంద్రం ఉప సంచాలకులు వి.నాగాచారి జిల్లాలోని సహాయ వ్యవసాయ సంచాలకులు , APAGROS మేనేజర్ పాల్గొనటం జరిగింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి