పేదల సంక్షేమమే లక్ష్యం
తూర్పు గోదావరి ;;సొంత ఆటో, టాక్సీ మరియు మేక్సీ క్యాబ్ డ్రైవర్లకు రెండవ విడత 2020-21 ఆర్థిక సంవత్సరం గాను 10వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి ఎకౌంటులకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆన్ లైన్ ద్వారా జమ జేసారు. గురువారం ముఖ్యమంత్రి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. కాకినాడ కలక్టర్ కార్యాలయం ప్రాంగణంలో వున్న వివేకానంద హాలు నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి పినిపే విశ్వరూప్, కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగాగీత, జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి, జెసి(డబ్ల్యూ ) జి.రాజకుమారి, డిఆర్ ఓ సి హెచ్.సత్తిబాబు, డిటిసి సిహెచ్.ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు. డిటిసి సిహెచ్.ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు. తరువాత రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ వైఎస్ఆర్ వాహనమిత్ర లబ్దిదారుల నుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆటో వాహనాల డ్రైవర్ల ఆర్థిక స్థితిగతుల దృష్టిలో పెట్టుకుని నాలుగు నెలల ముందే వైఎస్ ఆర్ వాహనమిత్ర పధకానికి సంబంధించి 10వేల రూ.లను లబ్దిదారుల ఖాతాలో జమ చేసారన్నారు. సొంత ఆటో, టాక్సీ, మేక్సి క్యాబ్ డ్రైవర్లు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన 10 వేల రూపాయల ఆర్థిక సహాయంతో డ్రైవర్లు తమ వాహనాలకు ఇష్యూరెన్స్ పిట్సస్, రి పేర్లు చేయించుకోవడానికి ఆవకాశం ఉంటుందని అన్నారు. గత సంవత్సరం తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ ఆర్ వాహన మిత్ర కింద 25 వేల745 మందికి ఒక్కొక్కరికి 10వేల ఆర్థిక సహాయం అందించడం జరిగిందని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం అదనంగా 4, 119మంది లబ్ధిదారులతో కలిసి 29 వేల 864మందికి ఈ పధకం కింద్ర ఆర్థిక సహాయం అందించడ జరిగిందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదల కొరకు అమలు చేయడం జరుగుచున్నదని మంత్రి అన్నారు. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 27 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీకి చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి వంగాగీత మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క కుటుంబానికి వివిధ పథకాల కింద దాదాపు 60వేల రూ.లు సంవత్సరానికి ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేద ప్రజల అభ్యున్నతి కొరకు పనిచేయుచున్నారని ఆమె అన్నారు. ఆటో డ్రైవర్లనుద్దేశించి ఆమె మాట్లాడుతూ ప్రస్తుత 0 కోవిడ్ - 19 దృష్టిలో పెట్టుకుని ఆటో మరియు కార్లలో ఎక్కవ మంది ప్రయాణికులను తీసుకుని పోరాదని దాని వలన కరోనా వ్యాధి విస్తరించకుండ ఉంటుందని ఆమె అన్నారు. సంబంధిత డ్రైవర్లు ఈ విషయం అర్థం చేసుకుని నిబంధల ప్రకారం ప్రయాణికులను తమ వాహనాలల్లో తీసుకుని పోవాలన్నారు. ఈ సందర్భంగా ఆమె కోవిడ్-19 ఎదుర్కొని పని చేయుచున్న జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. అనంతరం మంత్రి విశ్వరూప్, ఎమ్.పి వంగాగీత, కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి సమిష్టిగా జిల్లాకి సంబంధించిన వాహన మిత్ర చెక్కును విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో ఆర్ టి ఓ ఇన్- చార్జి జి.నరసింహరావు, ఇన్ స్పెక్టర్లు ఆర్.సురేష్, రాజేంద్రప్రసాద్, వైఎస్ వాహన మిత్ర లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి