మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన Si రవికుమార్ పై చర్యలు తీసుకోవాలి

*తూ.గో.జిల్లా.*

*ప్రత్తిపాడు నియోజకవర్గం.*

ప్రత్తిపాడు మండలం , చిన శంకర్లపూడి గ్రామానికి  చెందిన టీడీపీ  BC నాయకుడు *ఏపూరి శ్రీనివాస్* బెయిల్ పై  విడుదల.. 

  ఏపూరి శ్రీనివాస్ అరెస్ట్ పై నిరసన తెలుపుతూ చిన్నశంకర్లపూడిలో రోడ్ పై  బైఠాయించిన గ్రామస్థులు....

 

మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన Si రవికుమార్ పై చర్యలు తీసుకోవాలి అని నినాదాలు 

*నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వరుపుల రాజా* మాట్లాడుతూ

అక్రమ  అరెస్ట్ లు చేస్తున్న  Si రవికుమార్  పై  చర్యలు  తీసుకోవాలి అని , BC లపై నియోజకవర్గం లో పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు.నియోజకవర్గంలో నూటికి 80 శాతం కేసులు అక్రమంగా అమాయక ప్రజలపై పెట్టినవేనని అన్నారు.BC నాయకులు ఏపూరి శ్రీను మాట్లాడుతూ సివిల్ వివాదం కోర్టులో ఉండగా ప్రత్తిపాడు SI తగాదాలో తలదూర్చి బాధితుల తరుపున పని చేయకుండా బాధితులకు అండగా ఉన్న తనపై అక్రమ కేసులు బనాయించారని తెలిపారు.

BC మహిళపై అసభ్యకరంగా వ్యవహరించారని ఏపూరి శ్రీను ఆవేదన వ్యక్తంచేశారు.పెద్ద సంఖ్యలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు సంఘీభావం తెలిపారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు