శుక్రవారం డ్రై డే గా పాటిద్దాం

కాకినాడ ;;కాకినాడ నగరపాలక సంస్థ కమిషనరు స్వప్నిల్  దిన్ కర్ పుండ్కర్  ప్రభుత్వం వారి సూచనలు మేరకు  ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటిద్దాం అని   ఫ్రైడే డ్రై డే యొక్క ముఖ్య ఉద్దేశ్యం మన ఇంటి పరిసరాల్లో నిలిచిపోయిన వాన నీటి నిలువలు, మంచి నీటి నిలువలు, పూల కుండీలు, తొట్టెలు, టైర్లు, రోళ్ళు, డబ్బాలలో నిల్వ ఉన్న నీటిని పారవేసి దోమలు పెరగకుండ ఆపడం అని,  ఇవి తప్పకుండ పాటించి డెంగ్యూ, మలేరియ వంటి విష జ్వరాలకు గురి కాకుండ మనల్ని, మన ఇంటిని మరియు మన సమాజాన్ని రక్షించుకుందాం అని,  ఫ్రైడే ను డ్రై డే గా చేసుకుందాం అని వారు వారి యొక్క ఇంటి ఉద్యానవనంలో మరియు ఇంటి లోపలి భాగంలో స్వయంగా శుభ్రం చేసినారు. తదుపరి  ఫ్రైడే  డ్రై డే యొక్క ముఖ్య ఉద్దేశ్యంను ప్రజలు అందరికి తెలియజేయు నిమిత్తం నగరపాలక సంస్థ వారిచే ముద్రించబడిన కరపత్రాలు పంపిణీ కార్యక్రమం చేసినారు.అదేవిధంగా కమిషనర్ వారి పిలుపుమేరకు నగరపాలక సంస్థ అధికారులు అందరు వారి వారి ఇళ్ళ లోపలి, బయట ప్రదేశములను శుభ్ర పరచి సదరు విషయమును కమిషనర్ వారికి తెలుపుచూ వారి పరిసరాల కుటుంబముల వారిచే కూడా చేయిన్చినామని తెలిపినారు.                                                    కమిషనర్ స్థానిక గైగోలుపాడు ప్రాంతంలో 50 వ వార్డులో ఆకస్మిక తనిఖీ చేసి కొంతమంది వారి ఇంటి వెలుపలి ప్రాంతంలో కాలువలు మరియు రోడ్డు ప్రక్కల ఆక్రమించి వ్యాపారములు చేయుట గమనించి సదరు ఆక్రమణదారులును మందలించి వారితోనే సదరు ప్రదేశమును ఖాళీచేయించి,శుబ్రం చేయించినారు. ఈరొజు పర్యటనలో కమిషనర్తో  పాటు  ఆయా వార్డుల శానిటరీ కార్యదర్శులు, శానిటరీ సిబ్బంది పాల్గొనినారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు