సూర్య గ్రహణం ;; మూడు గంటలు వాయుస్తంభన,జలదీక్ష
తూర్పు గోదావరి ( ఐ.పోలవరం) ; ముమ్మిడివరం నియోజకవర్గం పిల్లంక గ్రామానికి చెందిన వేలూరి కాశి బాబు లోకకళ్యాణార్థం సూర్య గ్రహణం సందర్భంగా ఆదివారం మురమళ్ళ వృద్ధ గౌతమి నదిలో సుమారు మూడు గంటల పాటు వాయుస్తంభన, జల దీక్ష చేపట్టారు. ఈ జల దీక్షను ముమ్మడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ వృద్ధ గౌతమి గోదావరి నందు ముందుగా గంగ పూజ, గోదావరి హారతి కార్యక్రమం చేపట్టి శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమానికి మురమళ్ళ వీరేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ పెనుమత్స వాసు రాజు, ముదునూరు సతీష్ రాజు, మండల వైయస్సార్సీపి కన్వీనర్ శ్రీను రాజు, నడింపల్లి గణపతి వర్మ, దంతులూరి రవివర్మ, వైసిపి పార్టీ శ్రేణు లు, పలువురు పండితులు పాల్గొన్నారు. అలాగే ఈ జల దీక్షకు మద్దతుగా మురమళ్ళ వీరేశ్వరస్వామి దేవస్థానం ఆలయ వేదపండితులు బ్రహ్మశ్రీ గంటి సుబ్రహ్మణ్యశాస్త్రి వుడా జల దీక్షలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా మూడు గంటల పాటు జల దీక్ష స్మార్త పండితులు కాశి బాబు లోకకల్యాణార్థం కరోనా నివారణకు సూర్య గ్రహణం సందర్భంగా పలు వేదాలతో మంత్రపాటనాలు నిర్వహించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి