ఇంటర్‌లో అత్యధిక 10/10 గ్రేడతో ఆదిత్య జయకేతనం
ఇంటర్మీడియట్ - 2020 ఫలితాలలో జూనియర్ ఇంటర్‌లో అత్యధిక మార్కులతో, సీనియర్ ఇంటర్‌లో అత్యధిక 10/10 గ్రేడతో ఆదిత్య జయకేతనం ఇంటర్ బోర్డ్ ప్రకటించిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలలో ఆదిత్య జూనియర్ కాలేజ్ విద్యార్ధులు అద్భుత ఫలితాలతోపాటు అత్యధిక శాతం ఉత్తీర్ణతను సాధించారు.
జూనియర్ ఇంటర్ లో MPC విభాగంలో చి|| షేక్ రజియ 470 మార్కులకుగాను 465 మార్కులు సాధించి రాష్ట్రంలో అత్యుత్తమస్థానాన్ని దక్కించుకొన్నారు. అదేవిధంగా 464 మార్కులను నలుగురు, 463 మార్కులను నలుగురు, 462 మార్కులను ఎనిమిది మంది విద్యార్థులు సాధించారు. BiPC విభాగంలో చి|| K.V.S. హైగ్రీవ శర్మ, చి|| V. శ్రీ సాయి సౌమ్య, M.H. లక్ష్మీ తనీష 440 మార్కులకుగాను 432 మార్కులు సాధించారు. అదేవిధంగా, 431 మార్కులను ఐదుగురు సాధించారు. MEC విభాగంలో చి|| P.లలిత శ్రీ సాహితి, చి|| B.S.V.N.S. ఉదయ అను మల్లిక 500 మార్కులకుగాను 487 మార్కులు మరియు 486 మార్కులు ఎస్.వి.సాయి రితిక సాధించారు. సీనియర్ ఇంటర్ లో 124 మంది విద్యార్ధులు అత్యుత్తమ CGPA 10/10 ను సాధించారు. ఈ విజయాలు ఆదిత్య విద్యాపటిమను మరొక్కసారి ఋజువుచేసాయి. ఇంటర్ ఫలితాలలో ఘనవిజయాన్ని సాధించిన విద్యార్థులకు ఆదిత్య విద్యాసంస్థల ఛైర్మన్ డా|| నల్లమిల్లి శేషారెడ్డి అభినందనలందజేసారు. విజేతలు విద్యారంగంలో అనన్య సామాన్యమైన ప్రతిభను కనపరుస్తూ జీవితంలో ఉన్నతస్థానాన్ని అధిరోహించాలని ఆశిస్తూ ఆదిత్య విద్యాసంస్థల సెక్రటరీ శ్రీ ఎన్.కె.దీపక్ రెడ్డి, వైస్ ఛైర్మన్ శ్రీ ఎన్.సతీష్ రెడ్డి, జూనియర్ కాలేజెస్ కోర్డినేటర్ శ్రీ కె.లక్ష్మీకుమార్, డైరక్టర్లు శ్రీ ఎస్.వి. రాఘవరెడ్డి, శ్రీ ఎస్.పి.గంగిరెడ్డి, ఐ.ఐ.టి ప్రిన్సిపాల్ శ్రీమతి జె.మొయినా మరియు ఆదిత్య నిర్వహణలో గల ఇతర కేంద్రాలలో గల కళాశాలల ప్రిన్సిపాల్స్ అత్యధిక గ్రేడ్ లను సాధించిన విద్యార్థులను, ఉత్తమ శిక్షణనందించిన అధ్యాపకవర్గాన్ని అభినందించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి