కాకినాడలో ;; రూ. 1. 90 కోట్లతో మత్య్య శాఖ పరిపాలన భవనం
తూర్పు గోదావరి ;;మత్స్య శాఖకి సంబంధించి జిల్లాలో కాకినాడ స్మార్టు సిటీ నిధుల నుండి రూ. ఒక కోటి 90లక్షలతో మత్స్య శాఖ పరిపాలన కార్యాలయ భవనాన్ని నిర్మించడం జరుగుతుందని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మరియు జిల్లా ఇన్ చార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. శుక్రవారం కాకినాడ జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏటిమొగ బోట్ బిల్డింగ్ యాడ్ వద్ద నిర్మించనున్న మత్స్యశాఖ పరిపాలన భవన శంఖుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖామంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర మత్స్య, పశుసంవర్థక శాఖ మరియు జిల్లా ఇన్ చార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ, అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ, రాష్ట్ర మత్స్యశాఖ కమీషనర్ కె.కన్నబాబు, స్థానిక ఎమ్ఎవ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి లు ముఖ్య అతిదులుగా పాల్గొని, భవన శంఖుస్థాపన శిలాపలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి మత్స్యరంగం విశిష్టతను గుర్తించి ఈ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా నుండి తూర్పుగోదావరి జిల్లా వరకు పొడవైన సముద్ర తీర రేఖ ఉండడంతో ఈ ప్రాంత్రం మత్స్య రంగానికి అధిక ప్రాముఖ్యత సంతరించుకుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మత్స్యకారుల యొక్క ఆర్థిక స్థితిగతులు గుర్తించి ఇటివలే మత్స్యకార భరోసా ద్వారా ప్రతి మత్స్యకారునికి 10వేల ఆర్థిక సహాయం అందించడం జరిగిందని మంత్రి తెలిపారు. అదే విధంగా డిజిల్ సబ్సిడి కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ విధంగా ముఖ్యమంత్రి మత్సరంగానికి అధిక ప్రాముఖ్యత ఇవ్వడంతో పాటు పరిపాలనకు అవసరమైన భవనాలు, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. దీనిలోని భాగంగా జిల్లాకు సంబంధించి కాకినాడ స్మార్టు సిటీ నిధుల నుండి రూ. ఒక కోటి 90లక్షలతో మత్స్య శాఖ పరిపాలన కార్యాలయ భవనాన్ని నిర్మించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ భవనంలో మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, అదనపు డైరెక్టర్, కాకినాడ మత్స్య శాఖ అభివృద్ధి అధికారి, కాకినాడ అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్లకు సంబంధించిన కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా రూ. 700లక్షల లతో బోట్ బిల్డింగ్ యాడ్ నిర్మాణ దశలో వుందన్నారు. ఈ నిర్మాణం పూర్తి అయితే బోట్ మరమత్తులు మరియు కొత్త బోటులు నిర్మించుకునే సదుపాయం అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. అనంతరం మత్స్యశాఖ జెడి పి.కోటేశ్వరరావు కోవిడ్-19 పై మత్స్యశాఖ రూపొందించిన ప్రతిజ్ఞను అతిధులు మరియు మత్స్యకారులు చేత ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ సతీష్, మాల కార్పోరేషన్ చైర్మన్ పి.అమ్మజీ, కాకినాడ మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, మత్స్యశాఖ అదనపు డైరెక్టర్ ఎమ్.శ్రీనివాస్, ఎఫ్ డిఓలు, ఎడిఓలు, మత్స్యకారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి