కరోనా కంటే డేంజర్…! రాష్ట్రంలో విచ్చలవిడిగా నకిలీ శానిటైజర్లు – చోద్యం చూస్తున్న రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ : బీజెపీ రాష్ట్ర నాయుకులు  వై.వి. సుబ్బారావు.

 

గుంటూరు ;;అసలు శానిటైజర్ల స్థానంలో కొంత మంది నకిలీ శానిటైజర్లు తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారని, ఎలాంటి అనుమతులు, ప్రమాణాలు లేకుండా వీటిని తయారు చేస్తూ ఉంటారని, సాధారణంగా శానిటైజర్‌ చేతికి రాసుకున్న వెంటనే ఆవిరి అవుతుందని, కాని వీరు తయారు చేసిన నకిలీ శానిటైజర్లు అలా కావని బీజెపీ  నాయుకులు  వై.వి. సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నకిలీ శానిటైజర్ల వాడకం వలన ప్రజలు మాకు ఏమి అవధులే అనుకుంటారని, కానీ ఇది మార్కెట్ లో దొరికేవి నకిలీ అవడం వలన ఈ శానిటైజర్ల వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిపారు. అందువలన ప్రజలు మంచి బ్రాండెడ్ కంపెనీల శానిటైజర్లను వాడుకొని జాగ్రత్తగా ఉండాలని కోరారు. లైసెన్స్ మెడికల్ షాప్స్ వారి దగ్గరే కొనుక్కోవాలని సూచించారు. ప్రస్తుతం కరోనా భయం నేపథ్యంలో హ్యాండ్‌ శానిటైజర్లకు డిమాండ్‌ పెరగడంతో వాటిని తయారు చేసి ప్రజల సొమ్ము దొసుకుంటున్నారని ఇలాంటి నకిలీ శానిటైజర్లు మార్కెట్‌లో కొంటే మోసపోక తప్పదని, నకిలీ ఉత్పత్తులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వై.వి. సుబ్బారావు సూచిస్తున్నారు. అధికారుల నిర్లక్షంగా ఉండటంవలన అమాయక ప్రజలు మోసపోతుంటారని ఆవేదన చెందారు. శానిటైజర్ల సరిగా పనిచేయక , డబ్బులు ఖర్షు అయి ప్రజలు నానా అవస్థలు పడుతుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు ఈ నకిలీ శానిటైజర్లు తయారుచేసే కంపెనీలను అరికట్టకపోతే పరిస్థితి చేయి దాటిపోయే పరిస్థితి వస్తుందని, అందువలన నకిలీ శానిటైజర్లు తయారు చేసే కంపెనీ లను గుర్తించి వాటిని మార్కెట్ లోకి రాకుండా నిరోధించాలని రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ వారిని బీజెపీ రాష్ట్ర నాయుకులు  వై.వి. సుబ్బారావు కోరారు                                       .  

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు