ఎదురులంక రాధమ్మ రేవులో ఆయిల్ మాఫియా ;;;ఐ .పోలవరం పోలీసులు మెరుపుదాడి ... రెండు లారీలు సీజ్ అదుపులో డ్రైవర్లు

తూర్పు గోదావరి జిల్లాలో ఆయిల్ మాఫియా తన దందా కొనసాగిస్తుంది ... అక్రమ ఆయిల్ రవాణా చీకటి మాటున యథేచ్ఛగా జరుగుతున్నా చట్టం ప్రజా ప్రతినిధుల కనుసన్నలలో తన పని తానూ చేసుకు పోతుంది..తాజాగా ఐ పోలవరం మండలంలో రాధమ్మ రేవు ప్రస్తుతం ఆయిల్ అక్రమ రవాణాకు అడ్డాగా మారింది ఇక్కడ ఆయిల్ మాఫియాకు  అడ్డు అదుపు లేకుండా పోతుంది .. లక్షల్లో జరుగుతున్న ఆయిల్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసేది ఉందా ..లేదా ...  


 


తూ.గో.జిల్లా. ముమ్మిడివరం ;;అక్కడ గత కొంత కాలంగా భారీ ఎత్తున ఆయిల్ రవాణా అక్రమంగా జరుగుతుంది ... మారుమూల రేవు ... చీకటి మాటున లక్షల్లో అక్రమ రవాణా ...ఇదంతా ఎవరు  చేస్తున్నారు..ఇదో పెద్ద ఆయిల్ మాఫియా.. .  రాజకీయ అండతో అధికారుల కనుసన్నలలో జరుగుతుందా ... అలాగయితే పోలీసులు ఎందుకు మాటు వేసి మెరుపు దాడి చేయాల్సి వచ్చింది.. అసలు కధ ఏమిటీ ... కాకినాడ నుండి సముద్ర మార్గం ద్వారా ఇంజన్ బొట్లలో   గత కొంత కాలంగా ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఐ పోలవరం మండలంలోనిరాధమ్మ రేవు వద్దకు చేరుస్తున్నారు . అక్కడ నుండి అక్రమంగా లారీల ద్వారా తరలిస్తున్నారు. ఒక్కో లారీలో 12 వేళా లీటర్ల నింపిన ఆయిల్ విలువ 2 లక్షల రూపాయల  విలువ ఉంటుంది. ఆదివారం రాత్రి ఎదురులంక రాధమ్మ రేవులో ఇంజన్ బోట్ల ద్వారా ఏపీ 31 టి యు 46 49, ఏపీ 36 టి ఎ 31 61 రెండు ట్యాంకర్ల కు అక్రమ ఆయిలు సుమారు 24 వేల లీటర్లు, దీని విలువ నాలుగు లక్షల రూపాయలు ఈ అక్రమ ఆయిల్ ట్యాంకర్లను ఐ పోలవరం పోలీసులు మెరుపు దాడి చేసి పట్టుకున్నారు. ట్యాంకర్ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం ఈ ఆయిల్ ట్యాంకర్ లను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఇది గత కొంతకాలంగా  జరుగుతున్నా బాగోతమేనని అక్రమంగా తరలిస్తున్న ఆయిల్ మాఫియా లో కొందరు మద్య జరిగిన ఒప్పొందంలో విభేదాలు వచ్చి అక్రమ ఆయిల్ తరలింపు గుట్టు పోలిసిలకు చేరవేయడం వల్ల అసలు  రంగు బయట పడిందని స్థానికులు చర్చించుకుంటున్నారు ..  ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూద్దాం .... 


 


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు