భౌతిక దూరం ... బహుదగ్గరగా రేషన్ పంపిణి ;పొంచివున్న కరోనా ; ప్రభుత్వ సూచనలపై రేషన్ షాపు నిర్లక్ష్యం:




భౌతిక దూరం  బహు దగ్గరగా రేషన్ పంపిణి జరుగుతున్నా రేషన్ డీలర్ నిర్లక్ష్యం వహించడం పై సర్వత్రా విమర్శలు వెల్లువేత్హుతున్నాయి.  రెవెన్యూ అధికారుల కంటితుడుపు చర్యలు కరోనా ను ప్రోత్సాహమిచ్చేలా ఉన్నాయి. 

 

                                                                                         కాకినాడ  సంజయ్ నగర్ :

 ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కాకినాడను గ్రీన్ జోన్  గా ప్రభుత్వం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే...  ప్రజలు గ్రీన్ జోన్ లో నివసించినప్పటికీ  అప్రమత్తంగా ఉండాలని , తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు చెప్పినప్పటికీ వాటిని పాటించకుండా ప్రజలు కనీస సామాజిక దూరం కూడా లేకుండా మాస్కులు ధరించకుండా  ఒకరి  మీద ఒకరు మీద పడుతూ  రేషన్ షాప్ వద్ద  ఉచిత రేషన్ కొరకు  ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా వ్యవహరిస్తున్న తీరు కాకినాడ సంజయ్ నగర్ సమీపంలోని పర్లోపేట  4వ నెంబరు రేషన్ షాపు వద్ద చోటుచేసుకుంది.రేషన్ షాపుల వద్ద గ్రామ వాలంటీర్లకు నియామకాలు ఉన్నప్పటికీ ఇక్కడ విధులు నిర్వహించకపోవడంతో ప్రజలు ఇలా అజాగ్రత్తగా ప్రవర్తిస్తున్నారు. ఇది ఈ ఒక్క రోజే కాదని లాక్ డౌన్ లో పంపిణి చేసిన ప్రతిసారి , ప్రతి నెల రేషన్ కోసం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని అక్కడి రేషన్ షాప్ ప్రజలు   ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అటు రేషన్ షాపు డీలర్  కూడా దీనిపై స్పందించకుండా వారి వారి విధులు నిర్వహించుకోవడం భయాందోళనకు గురిచేస్తుంది.


 

 



 

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు