సమాచారశాఖ ఉద్యోగి డేవిడ్రాజు మృతి

కాకినాడ :సమాచార పౌరసంబంధ శాఖ కృష్ణా జిల్లా మచిలీపట్నం ఉపసంచాలకుల కార్యాలయంలో ఆడియో విజవల్ సూపర్ వైజర్ గా పని చేస్తూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమాచార శాఖలో డిప్యూటేషన్ పై పని చేస్తున్న కె.డేవిడ్ రాజు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం ఉదయం మరణించినట్లు ఉపసంచాలకులు జి.మనోరంజన్ ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా సమాచార పౌరసంబంధ కార్యాలయ సిబ్బంది డివిజనల్ పిఆర్వో శ్రీమతి కె.సరస్వతి, ఏపిఆర్వో ఎమ్.డి. విలాయత్ ఆలీ, ఎవిఎస్ జ.ధర్మరాజు , టైపిస్టులు ఎస్.కె.బి అహ్మద్, జి.ఎస్.కుమారి, డ్రైవర్ టి.సత్యనారాయణ, ఆఫీసు సబార్డినేట్లు ఎన్.చిట్టిరాజు, ఎమ్.మాధవకృష్ణ, జి.రాజు, ఎమ్.సతీష్ కుమార్, జె.సతీష్ బాబు, వాచ్ మెన్ వై.సూరిబాబు తో పాటు అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఐ.నాగార్జున, ఎన్.న రేష్ ఇంద్రపాలెంలో నివాసం ఉంటున్న కె.డేవిడ్ రాజు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎవిఎస్ డేవిడ్ రాజు మృతి పట్ల జోన్-2 ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, సమాచార పౌరసంబంధ శాఖ, విజయవాడ శ్రీమతి ఎల్.స్వర్ణలత, కృష్ణా జిల్లా డిడి భాషా, విజయవాడ ఎస్ఎసి ఏడి కె.సధారావు, ఏలూరు ఏడి నాగార్జున, జోన్-2 తూర్పు, పశ్చిమ కృష్ణా జిల్లాలలో పని చేస్తున్న సమాచార శాఖ అధికారులు, ఇంజనీర్లు, మృతుని కుటుంబానికి సంతాపం వ్యక్తం చేసిన వారిలో వున్నారన్నారు. రిటైర్డ్ జెడి ఎం.ఫ్రాన్సిస్, రిటైర్డ్ డిడి లు ఏ.బాబ్ది ( వైజాగ్), కె.జయరావు మచిలీపట్నం సంతాప సందేశాలు పంపిన వారిలో వున్నారని డిడి మనోరంజన్ తెలిపారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు