తండ్రిని రోకలి బండతో కొట్టి చంపిన కొడుకు...
అమరావతి :
బైక్ సర్వీసింగ్‌కు డబ్బులు ఇవ్వలేదని కన్నకొడుకే తండ్రిని రోకలి బండతో కొట్టి చంపాడు.
ప్రకాశంజిల్లా పెద్దారవీడు మండలం తంగిరాలపల్లి లో శనివారం రాత్రి జరిగిన సంఘటన.
వివరాలు...గ్రామానికి చెందిన లింగాల సుబ్చయ్య (55) కుమారుడు మరియదాసు శనివారం బైక్ సర్వీసింగ్ కోసం తండ్రిని రూ.300 అడిగాడు.
నిరాకరించడంతో వాగ్వావాదం జరిగింది. ఆగ్రహానికి లోనైన మరియదాసు రాత్రి డాబాపై నిద్రిస్తున్న తండ్రి తలపై రోకలితో గట్టిగా మోదాడు.
గాయపడ్డ సుబ్బయ్యను మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
పోలీసులు కేసు నమోదు చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి