వైద్య సేవలు మరింత బలోపేతం ;మంత్రి బోస్
కోవిడ్-19 ప్రభావంతో ప్రభుత్వ ఆసుపత్రులలో అందించుచున్న సేవలు గుర్తించి వీటిని మరింతగా బలోపేతం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవుచున్నదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.
తూర్పుగోదావరి;శుక్రవారం కలక్టర్ కార్యాలయంలో ఐదవ రోజున మన పాలన- మీ సూచన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యం పై సమీక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ దురదృష్టకర పరిస్ధితుల్లో కరోనాను ఎదుర్కొనే పరిస్ధితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణలో ప్రైవేట్ ఆసుపత్రుల సేవలను కూడా తీసుకోవడం జరుగుచున్నదని అన్నారు. కోవిడ్ -19 నియంత్రణలో మొదటి వరుసలో వైద్యులు, నర్సులు, పారిశుధ్య కార్మికులు, పోలీసులు సమన్వయంతో ఆహర్నిసలు శ్రమిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి వీరి సేవలను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య జాతీయ స్ధాయిలో నమోదవుతున్న కోవిడ్ సగటు రేటు కంటే చాలా తక్కువగా ఉందన్నారు. ప్రభుత్వం విద్య, వైద్యంతో పాటు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతను ఇచ్చి ఆ రంగాలలో త్వరితగతిన అభివృధ్ధి సాధించి, ఫలాలు సామాన్యులకు చేరేవిధంగా ముఖ్యమంత్రి పని చేస్తాన్నారన్నారు. భారత దేశ చరిత్రలో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీఎంబర్స్ మేంట్ వంటి పధకాలు సామాన్య ప్రజానికానికి చేరువయ్యాయన్నారు. అదే తరహాలో నేటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. ఆరోగ్య శ్రీ అమలులో నిష్ణాతులైన వైద్యుల సలహాలను ప్రభుత్వం వినియోగించుకుంటుందన్నారు.
జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ సామాన్య ప్రజలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పధకం సత్ఫలితాలిచ్చుచున్నదని అన్నారు. దీనిని మరింత బలోపేతంగా వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ రేకట సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. రేషన్ కార్డు లేకపోయినా వైద్య సేవలు పొందే విధంగా ఆరోగ్య శ్రీ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తోందన్నారు. 5 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నవారు రాష్ట్రంలోని కార్పొరేట్ ఆసుపత్రులతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా ఈ సేవలు పొందే ప్రయోజనం పొందవచ్చునన్నారు. నాడు-నేడు కార్యక్రమాల ద్వారా ప్రాదమిక వైద్య కేంద్రాలతో పాటుజిల్లా స్ధాయి ఆసుపత్రులలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఆసుపత్రి ఉన్నంతమాత్రాన సేవలు అందవని అందులో డాక్టర్లు, సిబ్బంది పని చేస్తేనే సామాన్యులకు వైద్య సేవలు అందుతాయన్నారు.దీనిని దృష్టిలో పెట్టుకుని కని, విని ఎరుగని రీతిలో డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషన్లు పోస్టులు నియమించి ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసే విధంగా ముందుకు వెళుచున్నదని కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు.
ఈ సమావేశంలో ఆరోగ్య శ్రీ , అంగన్ వాడీ కేంద్రాల ద్వారా లబ్దిపొందిన జే.పద్మ, జి.స్వర్ణలత, పద్మావతి, దూర్గాప్రసాద్, టి.భవాని, సత్యవతి తదితరులు ప్రభుత్వపరంగా తాము పొందుతున్న సౌకర్యాలను వివరించారు.
ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి డిఎంహెచ్ఓ డా. బి.సత్యసుశీల, ఐసిడిఎస్ పధకాల గురించి ప్రోజెక్ట్ డైరెక్టర్ సుఖజీవన్ బాబు, సిపిఓ రత్నబాబు, ఆరోగ్య శ్రీ పై జిల్లా కోఆర్డినేటర్ , తదితరులు జిల్లాలో అరోగ్యం పై చేపడుతు న్న కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి, జిల్లా కలక్టర్ ఆరోగ్యం పై ముద్రించిన మండల స్ధాయి కార్యాచరణ ప్రణీళిక పుస్తకాన్ని ఆవిష్కరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి