వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్వత్తుల రవాణా, ప్రాసెసింగ్ లపై ఆంక్షలు తొలగింపు ;మంత్రి కన్నబాబు

 


  తూర్పు గోదావరి ;;వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్వత్తుల రవాణా, ప్రాసెసింగ్ లపై ఆంక్షలను తొలగించడంతో పాటు, రైతులు పండించిన అన్ని పంటలకు మంచి ధర లభించేలా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు చేపట్టామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్ర కురసాల కన్నబాబు తెలియజేసారు . ఆదివారం సాయంత్రం రాష్ట్ర  వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్ర కురసాల కన్నబాబు తమ క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి లాక్ డౌన్, అకాల వర్షాల నేపద్యంలో వ్యవసాయ, అనుబంధ రంగాల రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ మూడవ దశ రేపటి నుండి కొన్న సడలింపలతో అమలౌతున్న నేపద్యంలో వ్యవసాయ, అనుబంధ రంగ ఉత్పత్తుల రవాణాపై రాష్ట్రంలో కంటైన్మెంట్ ప్రాంతాల మినహ అన్ని  చోట్ల ఆంక్షలు తొలగించామని తెలిపారు.  కరోనా లాక్ డౌన్ కారణంగా రైతాంగం నష్టపోకుండా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ద్వారా ఎంత  ఖర్ఛయినా వెనుకాడకుండా పలు కీలక నిర్ణయాలు గైకొంటున్నామని, ఏ పంట రైతూ తన పంట అమ్ముడు కాకుండా మిగిలిపోయిందనే వ్యధ చెందే పరిస్థితి రాకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు.  ఇందులో భాగంగానే టమోటా, అరటి పంటలను ప్రభుత్వం కొనుగోలు చేపట్టిందని, అరకులో గిరిజన రైతులు పండించిన బజ్జీ మిర్చి పంటను కూడా కొంటున్నామని తెలిపారు. గతంలో ఒడిస్సా, పశ్ఛిమ బెంగాల్ రాష్ట్రలలలోని మార్కెట్ లకు   తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం ప్రాంతంలో రైతులు పండించిన పెండలం వెళ్లేదని, లాక్ డౌన్ నేపద్యంలో రవాణా సమస్యలను దృష్టిలో ఉంచుకుని కిలో 13 రూపాయలకు మార్కెంటింగ్ శాఖ ద్వారా కొనుగోలుచేసి రైతు బజార్లలో విక్రయించేందుకు చర్యలు చేపట్టామన్నారు.  అలాగే  చిత్తూరు ప్రాంతంలో రైతులు పండించన బూడిద గుమ్మడి ఉత్పత్తులకు కూడా కొనుగోలు చేసి రైతులన ఆదుకుంటున్నామని తెలారు.  వ్యవసాయ, అనుబంధ రంగాల మార్కెటింగ్ కొరకు రాష్ట్రంలోని రైతు బజార్ల సంఖ్యను 100 నుండి 1075 పెంచామని, ఆర్టిసి బస్సులలో మొబైల్ మార్కెట్లను అన్ని జిల్లాలలో నిర్వహిస్తున్నామన్నారు.  ఇప్పటి వరకూ ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా స్విగ్గీ, జొమోటో  సంస్థల ద్వారా కూరగాయలు ప్రజలకు ఇంటివద్దే విక్రయించే వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టమన్నారు. గ్రామ స్థాయిలో కూడా 100 రూపాయలకే 5 రకాల పండ్ల కిట్ల విక్రయాలన విస్తరిస్తున్నామని, అదే తరహాలో కూరగాయల కిట్ల విక్రయాలకు కూడా చర్యలు చేపట్టామన్నారు.   రాష్ట్రంలో రైతుల ధాన్యం, మొక్క జొన్న, పసుపు, శెనగలు, జొన్న మద్దతు ధరకు కొనుగోళ్లు ముమ్మరం చేశామని, ప్రతి రోజు 75 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం, 8 వేల టన్నుల మొక్క జొన్న కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు.  రైతుల నుండి గ్రామ స్థాయిలో కళ్లాల నుండే ధాన్యం కొనుగోళ్లు జరిపేలా పిపిసి వ్యవస్థను విస్తరించామన్నారు.  క్లిష్ట పరిస్థితులలో ఉన్న రైతులకు మిల్లర్లు అండగా నిలవాలని, కష్టకాలంలో వారిని మోసగించాలని దళారులు ప్రయత్నిస్తే ఉపేక్షించేది లేదన్నారు.  రాష్ట్ర రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా కట్టడికి సాహసోపేతమైన నిర్ణయం గైకొన్నారన్నారు.  గుంటూరు, శ్రీకాకుళం, అనంతపురం, ప్రకాశం జిల్లాలలో రాగులు కొనుగోళ్లు చేపట్టామని, కర్నూలు జిల్లాలో 7 ఉల్లి కొనుగోళు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. గత 15 రోజులుగా కొబ్బరి ధర తగ్గుతున్న దృష్ట్యా తూర్పు గోదావరి జిల్లాలో 6 నియోజక వర్గాల పరిధిలో ఆయిల్ ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపడుతున్నామన్నారు. మామిడి ధరలను ప్రతి రోజూ సమీక్షిస్తున్నామని, రేపటి నుండి లాక్ డౌన్ సడలింపు ద్వారా ఇతర రాష్ట్రాలలోని మార్కెట్లు అందుబాటులోకి రానుందున రైతులకు మంచి ధర లభించనుందన్నారు. ఈ సీజన్ నుండి గ్రామ స్థాయిలోనే రాయితీలపై విత్తన విక్రయాలను అందించే ప్రక్రియ ప్రారంభిస్తున్నామని, గతంలోలా రైతులు వీటి కోసం మండల కేంద్రాల వరకూ వెళ్లవలసిన అవసరం ఉండదన్నారు.  రైతుల నుండి ప్రభుత్వమే నేరుగా విత్తనాలు కొని, శుద్ధి చేసి సరసమైన ధరకు రైతులకు అందుబాటులో ఉంచుతుందన్నారు.  అలాగే మినుగు, పెసర, కంది, చిరుధాన్యాలు, భూసారం పెంచే పచ్చి రొట్ట విత్తనాలన్ కూడా గ్రామ స్థాయిలో రైతులకు అందుబాటులోకి తెస్తామన్నారు.  రైతులకు అవసరమైన అన్ని వస్తు, సేవలు, సలహాలు గ్రామాల్లోనే అందించే రైతు భరోసా కేంద్రాలను మే 30 నుండి ప్రారంభించనున్నామని తెలిపారు.  రైతు భరోసా, పియం కిసాన్ లబ్దిదారుల జాబితాలను గ్రామ సచివాయాలలో ప్రదర్శించామని, అర్హలైన వారెవరైనా తమకు రాలేదని తెలియజేసినా, అనర్హులకు జారీ అయినట్లు ఫిర్యాదులు ఉన్నా పరిశీలించి తగు చర్య గైకొనడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల కనుగుణంగా జనతా బజార్లను త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు.  ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు 54 కోట్ల మేరకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేసామని, క్రొత్తగా 2660 హెక్టార్లలో జరిగిన నష్టాలకు కూడా పరిహారం అందిస్తామని తెలిపారు. 


జర్నలిస్ట్ లకు శుభకాంక్షలుః   ఆదివారం అంతర్జాతీయ పత్రికా స్వేఛ్చా దినోత్సవం పురస్కరించి రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మంత్రి కురసాల కన్నబాబు జర్నలిస్ట్ లకు అభినందనలు తెలియజేశారు.  తాను కూడా జర్నలిస్ట్ గానే కెరీర్ ప్రారంభించినందున జర్నలిస్ట్ ల జీవన పరిస్థితులు, కష్టనష్టాలు తనకు తెలుసునని, ప్రభుత్వానికి, ప్రజలకు మద్య వారధిగా, అనగారిన వర్గాల వెతలను వెలికి తెస్తూ, వారి గొంతు వినిపించేందుకు జర్నలిస్ట్ లు చేస్తున్న సేవలు వెలలేనివన్నారు. ప్రజా ప్రయోజనాల కొసం నిష్పక్షపాతంగా జర్నలిస్ట్ లు తమ కృషిని కొనసాగించాలని మంత్రి కన్నాబాబు  ఈ సందర్భంగా కోరారు.         


                                   


                                   


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు