ఇసుక సక్రమంగా సరఫరచేయాలి
జిల్లాలో నాడు - నేడు, ఉపాధి హామీ పధకం నిధులతో చేపట్టిన నిర్మాణ పనులకు సక్రమంగా ఇసుక సరఫరా చేయాలని సంబంధిత శాఖాధికారులను జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం కాకినాడ కలక్టర్ కార్యాలయం నందు కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి అధ్యక్షతన జిల్లాలో ఇసుక సరఫరా సమస్యల పై సంబంధిత శాఖాధి కారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ నాడు - నేడు, ఉపాధి హామీ పధకంతో చేపట్టిన నిర్మాణ పనులకు ఆటకం లేకుండా సక్రమంగా ఇసుక సరఫరా చేయాలన్నారు. రేపటి నుండి ఇసుక కావలసిన వారికి పూర్తి స్థాయిలో పంపిణీ చేయడం జరుగుతుందని కలక్టర్ తెలిపారు. అందుకు తగిన విధంగా ట్రాన్స్ పోర్ట్ అధికారులు ఇతర అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. నాడు - నేడు, ఉపాధి హామీ పథకం నిధులతో జరుగుతున్న నిర్మాణ పనులకు సంబంధించి పెండింగ్ లో వున్న ఇసుక ఆర్డర్ లను ఇసుక లభ్యత ఎక్కువగా వున్న ఇసుక రీచ్ ల వద్దకు మార్చాలని జిల్లా ఇసుక అధికారికి కలక్టర్ సూచించారు. ఏ ఇసుక రీచ్ నుండి ఎంత పరిమాణంలో ఇసుక తరలింపు అవుతుందో వివరాలు అందించాలన్నారు. జిపిఎస్ ట్రాకింగ్ లేని వాహనాలు ఇసుక రవాణాకు అనుమతి లేదన్నారు. ఇసుక అక్రమ రవాణా చేసే వారి పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జెసి (డబ్ల్యూ ) జి.రాజకుమారి, ఎబి అడిషనల్ ఎస్.సి సుమిత్ గరుడ, పిఓ ఎస్ఎస్ఎ బి.విజయ్ కుమార్, డిటిసి సి హెచ్. ప్రతాప్, జిల్లా ఇసుక అధికారి బి.రవికుమార్, ఎస్.ఇ ఆర్ డబ్ల్యూఎస్ గాయిత్రీ దేవి, పంచాయితీ రాజ్ ఎస్.ఇ నాగరాజు, ఎస్ఎస్ఎ ఎపిఓ నరసింహరాజు, టైబుల్ వెల్ఫేర్ ఇఇ రమదేవి, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ( సమాచార శాఖచే జారీ)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి