కలెక్టర్లతోముఖ్యమంత్రి

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీవైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం జిల్లా కలక్టర్లు, ఎస్.పిలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కోవిడ్-19 నియంత్రణ చర్యలు వ్యవసాయం, త్రాగునీరు, జాతీయ ఉపాధి హామీ పధకం, నాడు-నేడు ఇళ్ల పట్టాలు తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లా కలక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ ఇళ్ల స్థలాలకు సంబంధించి భూ సేకరణ కొరకు ఇప్పటి వరకు 664 కోట్ల రూపాయలు సంబంధిత భూ యాజమానులకు చెల్లించడం జరిగిందన్నారు. ఇంకా 575కోట్ల బిల్లులను చెల్లింపు కొరకు అప్లోడ్ చేయడం జరిగిందని తెలియజేసారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్.పి అద్నామ్ నయీం అస్మీ, జెసి జి.లక్ష్మీశ, జెసి-2 జి.రాజకుమారి, డిఆర్ ఓ సిహెచ్.సత్తిబాబు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ( సమాచార శాఖచే జారీ)


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు