ఇండియాలో కరోనా జెట్ స్పీడ్ ;;ఒక్క రోజులో రికార్డు

గడిచిన 24 గంటల్లో 2,411 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. మన దేశంలో ఒకే రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతున్నా... మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం కేసులు వేగంగా పెరుగుతున్నాయి.


 



                                                                                                                          ఓ వైపు దేశంలో లాక్‌డౌన్ పొడిగిస్తూ ఉన్నా... కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతున్నా... మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,411 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. మన దేశంలో ఒకే రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 37,776కి చేరుకుంది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల 71 మంది చనిపోయారు. దీంతో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 1,223కు చేరింది. ఇక ఈ వైరస్ బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ రోజు వరకు 10,018 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకుని బయటపడ్డారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.



                                                                                               దేశవ్యాప్తంగా మరో రెండు వారాలు లాక్‌డౌన్ పొడిగించింది కేంద్రం. మే 17 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రెడ్ జోన్ల పరిధిలో పూర్తి స్థాయిలో ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. అక్కడ యథాతధంగా లాక్‌డౌన్ కొనసాగుతుందని ఉత్తర్వులో పేర్కొంది. గ్రీన్, ఆరెంజ్ జోన్లనో మాత్రం కొంత వరకు ఆంక్షలను సడలిస్తారు. అప్పటి వరకు విమానాలు, మెట్రో, రైళ్లు ప్రయాణాలపై నిషేధం ఉంటుందని పేర్కొంది. స్కూళ్లు, ఆఫీసులు, కాలేజీలు, హోటల్స్, రెస్టారెంట్లు, జిమ్స్, సినిమా హాళ్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌, బహిరంగ సభలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఇది అన్ని జోన్లకూ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు