విద్యకు నిర్మాణాత్మకమైన అంశాలను సూచించాలి
తూర్పుగోదావరి ;;ప్రభుత్వం మన పాలన - మీ సూచన లు ద్వారా వినూత్న రీతిలో వివిధ వర్గాల నుండి సలహాలు, సూచనలు స్వీకరిస్తునందున తగిన విధంగా నిర్మాణాత్మకమైన అంశాలను సూచించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కోరారు. తొలియేడు - జగనన్నతోడు కార్యక్రమంలో భాగంగా బుధవారం కాకినాడ కలక్టర్ కార్యాలయంలో విద్యారంగం పై రాబోయే నాలుగు సంవత్సరాలు తీసుకోవలసిన కార్యక్రమాల పై ఉపముఖ్యమంత్రి తో పాటు కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి, ప్రోపెసర్స్, విద్యావేత్తలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపద్యంలో పోటీ తత్వం పెరిగిందని, దీనిని చేరుకొనే విధంగా విద్యారంగంలో మార్పులు రావలసి వుందన్నారు. మన యూనివర్శిటీలు ఉన్నత స్థాయిలో ఉండడమే ముఖ్యమ ంత్రి ఆలోచనగా ఉందన్నారు. తదనుగుణంగా నిపుణులు సలహాలు, సూచనలు చేయాలన్నారు. వీటినంటిని క్రోడికరించే ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరుగుతుందన్నారు. కోవిడ్-19 ప్రభావం వలన విద్యార్థుల చదువులను రెండు నెలలు ఆలస్యమౌతుందని, ఈ సమయాన్ని పూరించే విధంగా తగు సలహాలు - సూచనలు చేయాలని ఉపముఖ్యమంత్రి ఉపాధ్యాయ వర్గాలకు సూచించారు. జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సర కాలంలోనే విద్యారంగంలో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. గత సంవత్సరం వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రారంభంతో 7 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు జరిగిందన్నారు. మద్యాహ్నం భోజన పధకంలో మెను మార్పు, అమ్మఒడి, నాడు-నేడు, జగనన్న వసతి దీవెన కార్యక్రమాలను తక్కువ సమయంలో అందించగలిగామన్నారు. ప్రభుత్వం ఆక్వాలాంటి రంగాల్లో కోట్లాది రూపాయలు హెచ్చిస్తుందని ఈ రంగంలో రాణించే విధంగా విద్యా వ్యవస్థలో తగిన నాణ్యత ప్రమాణాలతో కూడిన కోర్సులను కళాశాలు, యూనివర్శిటీలు ప్రవేశ పెట్టే విధంగా సూచనలు చేయాలన్నారు. దేవిపట్నం కచ్చూలూరు బోట్ ప్రమాదం సమయంలో ఎవరిని సంప్రదించాలనే వ్యవస్థ మన దగ్గర లేదని, అలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేసే విధంగా నిపుణులు, మేధావులు తగు సలహాలు, సూచనలు చేయాలన్నారు. ఒక సంస్థ బాగా పనిచేస్తుందనే భావం వస్తే ఆ సంస్థలో పనిచేసే వ్యక్తులను బట్టి వుంటుందని సంస్థ కాదని కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. మండలి సభ్యులు, విద్యావేత్త ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎయిడెడ్ విద్యాసంస్థల్తో పేద విద్యార్థులకు ప్రభుత్వం అందించే సహాయం అందాలన్నారు. ఆధార్ కార్డులో అభ్యంతరాలు ఉన్నాయని నేపంతో అమ్మఒడి లాంటి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందడం లేదని వీటిని సరిచేయాలన్నారు. నాడు- నేడు ద్వారా చేపట్టే పనులు పూర్తి నాణ్యతతో ప్రమాణాలు చేపట్టాలన్నారు. ఎమ్ ఇఓ, డిప్యూటీ డిఇఓ, డిఇఓ లు అకాడిమిక్ పైనే పూర్తిస్థాయిలో దృష్టి సాదిస్తే మంచి ఫలితాలు వస్తాయని ఇళ్ల వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సమావేశంలో జెఎన్‌టియుకె వైస్ చాన్సలర్ ఎమ్.రామలింగరాజు, మాజీ వీసి అల్లం అప్పారావు తో పాటు స్కూల్ ఎడ్యూకేషన్, హైయర్ ఎడ్యూకేషన్, టైబుల్ ఎడ్యూకేషన్, తదితర రంగాలకు చెందిన వారు తగిన సలహాలు, సూచనలు చేసారు. ఈ సమావేశంలో జెసి(డి) కీర్తి చేకూరి, ట్రైనీ అసిస్టెంట్ కలక్టర్ డా. అపరాజిత సింగ్ సిన్ సిన్, ఎస్ఎన్ఎ పిఓ విజయభాస్కర్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి