ఈ ఘోరానికి బాధ్యులు ఎవరు ...?గొల్లల మామిడాడ లో కరోనా విజృంభణ వెనుక తప్పిదమేవరిది
...లాక్ డౌన్ నిభందనలు అమలులో నిర్లక్ష్యం
...పట్టించుకోని వ్యాపారులు
...కేసుల పెరుగుదల పై ప్రజల ఆందోళన
పెదపూడి, (తూర్పుగోదావరి )పెదపూడి మండలం గొల్లల మామిడాడ లో కరోనా విలయతాండవం వెనుక మానవ నిర్లక్ష్యమే కొంపముంచిందా .. అవుననే అంటున్నారు విశ్లేషకులు . ప్రశాంతంగా ఉండే జిల్లాలో కరోనా విలయతాండవం చేయడం లో ప్రజల అశ్రద్ధ, అవగాహనా లేమి తో పాటు అధికారుల నిర్లక్ష్యం కూడా కారణమే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా కారణంగా మెదటి విడత లాక్ డౌన్ విధించిన దగ్గర నుండి 4 వ విడత లాక్ డౌన్ వరకూ గొల్లల మామిడాడ ప్రాంతంలో లాక్ డౌన్ నిభందనలు అమలు చేయడంలో అధికారులు పట్టనట్టు వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలోనే కరోనా కేసులు నమోదు జరుగుతున్న ఎక్కడా కరోనా బాధితులు మరణించిన దాఖలాలు లేవు. గొల్లల మామిడాడ లో మాత్రం జిల్లాలో తొలిసారిగా కరోనా మృతి నమోదు కావడం గమనార్హం. దీనిని బట్టి చూస్తే అధికారులు నిబంధనలు అమలు లో విఫలం కావడం, ముందు జాగ్రత్తలు పాటించకపోవడం తో కరోనా విజృంభణలో అటు ప్రజల అవగాహన లేమి తోడు కావడంతో మహమ్మారి మనిషి ప్రాణం మీదకి తెచ్చుకున్నట్టు ఐనది .
లాక్ డౌన్ అమలు లో భాగంగా మొదటి రెండు విడతల్లోనూ పెదపూడి మండలంలో అధికారులు, పోలీసులు కొంచెం కఠినంగానే వ్యవహరించారు. ఐతే మూడవ విడత లాక్ డౌన్ అమలు నుండి అధికారులు కొంచెం పట్టు సడలించడంతో గొల్లల మామిడాడలో దాదాపు అన్ని దుకాణాలు తెరుచుకున్నాయి. లాక్ డౌన్ అమలు లో కొన్ని దుకాణాలకు మాత్రమే ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చిన ఇక్కడ మాత్రం వస్త్ర, వ్యాపారాలు, హోటల్స్ అన్ని తెరుచుకున్నాయి. ముఖ్యంగా మామిడాడ రావిచెట్టు సెంటర్ లో కరోనా కారణంగా మృతి చెందిన వ్యక్జ్తి పనిచేసిన హోటల్ ద్వారా అధికారులు కళ్ళ ముందే వ్యాపారం జరుగుతున్న వారు నియంత్రించకపోవడంతో కరోనా వ్యాప్తి కి ఇక్కడి నుండే నాంది పలికింది. జిల్లావ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న మామిడాడ లో మాత్రం ఆ ఛాయలు లేకపోవడంతో అధికారులు, పోలీసులు సైతం ముందస్తు కఠిన చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు అనే విమర్శలు ప్రజల నుండి వినిపిస్తున్నాయి. దింతో లాక్ డౌన్ లో సైతం తెరచి అమ్మకాలు సాగించిన హోటల్ లో క్యాషియర్ కారణంగా కరోనా వ్యాప్తి చెంది నేడు పక్క మండలానికి కూడా పాకింది. కరోనా సోకినా వ్యక్తి తన అనారోగ్యం విషయంలో ముందస్తు జాగ్రత్త లేని కారణంగా నేడు కొన్ని వందల మంది ఇబ్బందులు పాలయ్యారు. ఒకరి నుండి మరొకరికి వేగంగా వ్యాపించే ఈ కరోనా వ్యాధి తో గొల్లల మామిడాడ తో పాటు బిక్కవోలు, రామచంద్రపురం మండలాల్లో సుమారు 800 మందికి కు పైగా కరోనా నిర్ధారణ పరీక్షలుకు హాజరు కావాల్సిన అగత్యం ఏర్పడింది.
కరోనా నియంత్రణలో భాగంగా విధించిన లాక్ డౌన్ అమలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల పై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పచ్చని పల్లె సీమల్లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేయడం వెనుక ఖచ్చితంగా అధికారుల అలసత్వమే కారణమని ప్రజలు అంటున్నారు. ఐతే ప్రస్తుతానికి జిల్లా ఉన్నతాధికారులు కేవలం కరోనా నివారణ చర్యలు, పాజిటివ్ కేసుల గుర్తింపు పైనే ద్రుష్టి సారించారు. అసలు స్థానికంగా కరోనా వ్యాప్తికి పరోక్షంగా కారణమైన వ్యక్తులు, అధికారులపై చర్యలు తీసుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామంలో ఒక కాఫీ హోటల్ ద్వారా ప్రారంభమైన ఈ కరోనా వ్యాప్తి మరెంత దూరం వెళుతుందో అనే భయంతో మామిడాడ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా మృతి తో ప్రారంభమైన ఈ కేసుల పరంపర ఇప్పటికే 35 మంది కరోనా పాజిటివ్ కేసుల వరకు చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులే అంచనా వేస్తున్నారు. ఇదిలా కొనసాగితే గొల్లల మామిడాడ మరొక కోయంబేడు గా మారుతుందనే భయాలు ప్రజలను వెన్నాడుతున్నాయి. కనీసం ఇప్పటికైనా అధికారులు లాక్ డౌన్ అమలు విషయంలో దిద్దుబాటు చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలకు రక్షణతో బాటు వారికి అన్ని విధాలా భరోసా కల్పించేదిశగా చర్యలు చేపట్టాల్సిన వసరం ఉంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి