వచ్చే ఖరీఫ్ ;;మార్కెట్ కు అనుకూలమైన ,వినియోగదారులు వినియోగించే వరి రకాలు సాగుకు రైతులను ప్రోత్సహించండి
తూ .గో ;;జిల్లాలో వచ్చే ఖరీఫ్-2020 సీజన్ కి సంబంధించి మార్కెట్ కి అనుకూలమైనవి, వినియోగదారులు వినియోగించే వరి రకాలను సాగు చేయుటకు రైతులను ప్రోత్సహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా.జి.లక్ష్మిశ వ్యవసాయ శాఖ అధికారులు ఆదేశించారు. శుక్రవారం కాకినాడ వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్, సివిల్ సప్లై విసి మరియు ఎండి సూర్యకుమారి అమరావతి నుండి ఖరీఫ్-2020 సీజన్ కి సంబంధించి వరి ఉత్పత్తి ప్రణాళిక, సేకరణకు అనువైన మరియు మేలైన వరి రకాలు ఖరారు చేయడం వంటి అంశాలపై నిర్వహించిన విడియో కాన్ఫరెన్స్ కు కలెక్టర్ కార్యాలయం నుండి జెసి లక్ష్మీశ, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ లో వరి సాగు రకాలలో మార్కెట్ మరియు రైతుల ప్రాధాన్యత విషయంలో ఎటువంటి సమస్య లేదని వ్యవసాయ కమిషనర్ అరుణ్ కుమార్ కి జెసి వివరించారు. జిల్లాలో వచ్చే ఖరీప్ 2020 సీజన్ కు సంబంధించి మార్కెట్ కి అనుకూలమైనవి మరియు వినియోగదారులు ఎక్కువగా వినియోగించే రకాలను సాగు చేయుటకు రైతులను ప్రోత్సహించాలన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ లో వరి కింద జిల్లాలో ఉన్న సాధారణ విస్తీర్ణం ప్రాంతం 2 లక్షల 23 వేల 431 హెక్టార్లకు గాను 12.87 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు జెసి తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వ్యవసాయ శాఖ జెడి కె.ఎస్.వి. ప్రసాద్, డిడిలు వి.టి.రామారావు, ఎస్.మాధవరావు, సివిల్ సప్లై డి.యం లక్ష్మిరెడ్డి, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డా.సీతారామ శర్మ, తూర్పు గోదావరి జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి