ఏపీలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్రకటించిన ప్రభుత్వం
ఏపీలో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే..రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 6497 సాంపిల్స్ ని పరీక్షించగా 71 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 1403 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 321 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1051గా ఉంది. కృష్ణా, కర్నూల్, గుంటూరు జిల్లాలలో అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి.. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం రెడ్,ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్రకటించింది.. ఇందులో రెడ్ జోన్ల కిందికి కర్నూల్, గుంటూరు, కృష్ణ, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు వస్తాయి.. ఆరెంజ్ జోన్ల కిందికి తూర్పుగోదావరి, పచ్చిమ గోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖ జిల్లాలు వస్తాయి.. గ్రీన్ జోన్ జిల్లా కిందికి విజయనగరం జిల్లా వస్తుంది. ఎందుకంటే ఇంతవరకు అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి