వైద్యులే ..దేవుళ్ళు ;;మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్..

ప్రస్తుతం మన దేశం కరోనా మహామ్మారి బారిన పడింది. ఈ వైరస్ కట్టడిలో భాగంగా కేంద్రం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న వైద్యుల సేవలను మహేష్ బాబు కొనియాడారు.


 



                                                               ప్రస్తుతం మన దేశం కరోనా మహామ్మారి బారిన పడింది. ఈ వైరస్ కట్టడిలో భాగంగా కేంద్రం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే కదా. ఐనా దేశంలో చాలా ప్రాంతాల్లో కరోనా విలయ తాండవం చేస్తూనే ఉంది. దీంతో కేంద్రం మూడోసారి మరో రెండు వారాలతో పాటు లాక్‌డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే కదా. ఇందులో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మాత్రం కాస్త పట్టు సడలించింది కేంద్రం. ఇక కరోనా ఎఫెక్ట్ దేశంలోని దాదాపు అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.చైనాలో వ్యాప్తి చెందిన ఈ వైరస్ కారణంగా ఎంతో మంది అకాల మరణం పొందారు. కేవలం కరోనా వైరస్ ఇపుడు మన దేశంతో పాటు ప్రపంచ దేశాలను సైతం వణికిస్తోంది.  ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా డాక్టర్లు, నర్సులు, పోలీసులు, మీడియా,పారిశుద్ధ కార్మికులు, జల మండలి, విద్యుత్ వంటి  అత్యవసర సేవలు మాత్రం నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. తాజాగా కరోనాను ఎదుర్కొనేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి తమ వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్న డాక్లర్లతో పాటు ఇతర వైద్య సిబ్బంది చేస్తోన్న సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా కొంత మంది మాత్రం డాక్టర్లు చేస్తోన్న సేవలను విస్మరించి వారిపై దాడులకు దిగడం అత్యంత హేయం. తాజాగా మహేష్ బాబు వైద్యో నారాయణో హరి అన్న సూక్తి అనుసరించి వైద్యులు నిజంగా నారాయణులే అంటూ వారి సేవలను కొనియాడాడు. 








 








కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు