శంఖవరం ;;గిరిజనులకు లయన్స్ క్లబ్ సహకారం
శంఖవరం,( తూ గో) అక్షర లీడర్: మండపం పంచాయతీలోని తాళ్లపాలెం గిరిజనులకు శనివారం సత్యదేవ లయన్స్ క్లబ్ జోనల్ అధ్యక్షురాలు పర్వత జానకీదేవి ఆధ్వర్యంలో పేద ప్రజలకు బియ్యం ,కూరగాయలు, పండ్లు,మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లాక్ డౌన్ మే 17వరకు పొడిగించిన నేపథ్యంలో పనులు లేక ఇబ్బందిపడుతున్న పేద ప్రజలకు మానవతా దృక్పథంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని ఆమె తెలిపారు. తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ వ్యవసాయ, ఉపాధి పనులు చేసుకోవాలని కోరారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చేతులను తప్పని సరిగా శుభ్రపరచుకోవా లని ఆమె గిరిజనులకు తెలిపారు. మారుమూల ప్రాంతాన్ని గుర్తించి సహాయ సహకారాలు అందించిన అధ్యక్షురాలు జానకి దేవికి, లయన్స్ క్లబ్ సభ్యులకు గిరిజనులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్నవరం అధ్యక్షులు ప్రసాద్ , సభ్యులు రమేష్, నాగేశ్వరరావు , రామలింగేశ్వరరావు, డొంకాడ గిరి, పర్వత వివేకానంద మొగలి శ్రీను, ఆవాల ప్రసాద్ , గీతిక, నూకరాజు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి