పథకాలు సక్రమంగానే అందుతున్నాయి ;;మేధో మధనంలో ప్రశంసలు
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ పై మన పాలన- మీసూచన క్రింద మేధోమధన సదస్సును మంత్రులు, జిల్లాకలక్టర్లు, వైద్యాధికారులతో నిర్వహించారు. ఈ సదస్సులో వైద్య ఆరోగ్య శాఖ గత సంవత్సరంలో సాధించిన ప్రగతి గురించి రాబోయే నాలుగుసంవత్సరాల్లో మరింత చేరువలో శాఖను ఉంచే విధంగా ముఖ్యమంత్రి వివిధ సూచనలను చేశారు.
తూర్పుగోదావరి ;;జిల్లా కలక్టర్ కార్యాలయం నుండి విడియోకాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి , రెవెన్యూ శాఖా మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి, డియంహెచ్ఓ డా. బి.సత్యసుశీల, ఐసిడిఎస్ పిడి సుఖజీవన్ బాబు, సిపిఓ రత్నబాబు, ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్ డా. కిషోర్, ఆరోగ్య శ్రీ లబ్దిదారులు, ఆరోగ్య శాఖాధికారులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి తాడేపల్లి కార్యాలయం నుండి తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి ఐసిడిఎస్ ప్రోజెక్ట్ సంబంధించి అడ్డతీగల మండలం కోనలోవ గ్రామానికి చెందిన అంగన్ వాడీ టీచర్ కంచెం సత్యవాణి ముఖ్యమంత్రితో ముఖాముఖిలో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీమతి కె.సత్యవాణి మాట్లాడుతూ తాను గత 15 సంవత్సరాల నుండి అడ్డతీగల మండలంలో అంగన్ వాడీ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన క్రొత్త పధకాలు పిల్లలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. డా.వైయస్ఆర్ సంపూర్ణ ఆరోగ్య పోషణ పధకం క్రింద గర్భిణీలకు అందించే పౌష్టికాహారం ఎంతగానో ప్రయోజనకరంగా ఉందన్నారు. ఈ పౌష్టికాహారం ద్వారా గర్భిణీలకు సుఖ ప్రసవం జరగడంతో పాటు పుట్టిన బిడ్డలు ఆరోగ్యంగా ఉంటున్నారన్నారు. అదే విధంగా గత ఏడాది కాలంలో గర్భిణీ, మాతృ, శిశు మరణాలు చాలా వరకు తగ్గాయన్నారు. అదే విధంగా ఆరు నెలల నుండి 3 సంవత్సరాల వరకు పిల్లలకు అందించే పౌష్టికాహారం పిల్లలకు సక్రమంగా అందుతుందన్నారు. కరోన లాక్ డౌన్ క్లిస్ట సమయంలో ఏజెన్సీ ప్రాంతంలో పనులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భంలో మా ప్రాంత ఎంఎల్ఏ శ్రీమతి నాగులాపల్లి ధనలక్ష్మి, డిసిసిబి ఛైర్మన్ అనంత
ఉదయ భాస్కర్ ఇంటింటికి నిత్యావసర వస్తువులు ఇచ్చి ప్రజలను ఆదుకున్నారన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో అంగన్ వాడీ భవన కేంద్రాల కొరత ఎక్కవగా ఉన్నదని, కాబట్టి సొంత భవనాలను ఏర్పాటు చేస్తే బాగుటుందని ఆమె తెలిపారు. గత సంవత్సరం అప్పటి ఐటిడిఏ పిఓ నిషాంత్ కుమార్ తన అంగన్ వాడీ కేంద్రాన్ని సందర్శించి అద్దె భవనం స్ధానే సొంత భవనం నిర్మించుటకు స్ధలం కేటాయించారని, భవన నిర్మాణానికి 10 లక్షల 50 వేల రూపాయలు గ్రాంట్ మంజూరు చేశారని, ప్రస్తుతం ఆ భవనం నిర్మాణం పూర్తి కాపచ్చిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తన తండ్రికి రెండు సార్లు గుండె చికిత్స చేయవల్సి వచ్చిందని ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ క్రింద నిధులు విడదల చేయడం వలన శస్త్ర చికిత్స చేయించడం జరిగిందన్నారు, అదే విధంగా తన సోదరి కుమారునికి ఊపిరితిత్తుల సమస్య వస్తే 90 వేల రూపాయలు సియం రిలీఫ్ ఫండ్ క్రింద దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి మంజూరు చేశారని ఆమె తెలిపారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి