ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజాసంక్షేమమేప్రదానం ;మంత్రి పిల్లి

తూర్పుగోదావరి ;;రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికి ఈ సంవత్సర కాలంలో 42వేల కోట్ల రూపాయల నిధులతో వివిధ పథకాల కింద ఖర్చు పెట్టినట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. మన పాలన - మీ సూచన భాగంగా సోమవారం మధ్యాహ్నం వివేకానంద సమావేశపు మందిరంలో మేదో మధన సదస్సు లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా దాదాపు 27 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం జూలై మాసంలో జరుగుటకు చర్యలు తీసుకును చున్నట్లు తెలియజేసారు. రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం హాయాం లో చేసిన బాకీలు, వడ్డీలు చెల్లించడంతో పాటు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలియజేసారు. ఈ మేదో మధన సదస్సులో స్వచ్ఛంద సంస్థల వారు, గ్రామ వాలంటీర్లు, అధికారులు పధకాలు మరింత వేగంగా అర్హులందరికి అందే విధంగా సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. ఈ సలహాలు, సూచనలు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. జాయింట్ కలక్టర్(డి) శ్రీమతి కీర్తి చేకూరి మాట్లాడుతూ గ్రామ, సచివాలయం వాలంటీర్ల వ్యవస్థ చాలా గొప్పవని, వాటిని మరింత బలో పేతం చేసి ప్రజలకు దగ్గర కావడానికి సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఎప్పటికప్పుడు వారి వద్దకు వచ్చిన సమస్యలను పరిష్కరించాలని ఆమె కోరారు. జాయింట్ కలక్టర్ ( డబ్ల్యూ) జి.రాజకుమారి మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు పటిష్టవంతంగా అమలు చేయాలంటే ముందుగా గ్రామ సచివాలయాల సిబ్బందికి, వాలంటీర్లకు ఆ పధకాలపై అవగాహన ఉండాలన్నారు. వాలంటీర్లకు గ్రామ సచివాలయాల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆమె అన్నారు. ఏ ఒక్క అర్హత ఉన్న లబ్ధిదారుడు నష్టపోకుండా చూడవలసిన బాధ్యత గ్రామ, సచివాలయం మరియు వాలంటీర్ల పై ఉన్నదని అన్నారు. జిల్లా పరిషత్ ముఖ్యకార నిర్వాహణాధి కారి శ్రీమతి ఎమ్.జ్యోతి మాట్లాడుతూ ఈ సధ స్సులో తీసుకున్న సలహాలను, సూచనలను రికార్డు చేసి ప్రభుత్వానికి పంపడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సి హెచ్.సత్తిబాబు, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి సూర్యప్రసాద్, జిల్లా అధికారులుతో పాటు వాలంటీర్లు, గ్రామ సచివాలయాల సిబ్బంది పధకాలు అమలులో తగు సూచనలు ఇచ్చారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు