కరోనా వైరస్ ;;అధికారుల వ్యాధి నిరోధక శక్తికి ఆయుష్మాన్ భారత్ హేర్బల్స్ ... మోడీ చాయ్ అందించిన తుమ్మల పద్మజ
తూర్పుగోదావరి ;ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలు పణంగా పెట్టి శ్రమిస్తున్న అధికారుల సేవలు శ్లాఘనీయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తుమ్మల పద్మజ ప్రకాశ్ అన్నారు. ' ఆమె ఆధ్వర్యంలో లాక్ డౌన్ సమయంలో కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వ కార్యాలయాలు సిబ్బందికి సామర్లకోట,పెద్దాపురం పట్టణాలలో మున్సిపాలిటీ, MRO, MDO,పోలీస్ స్టేషన్, ప్రభుత్వ హాస్పిటల్ నందు ఆయుష్ భారత్ వారు సూచించిన హెర్బల్ చాయ్, మాస్కలు, పండ్లు వితరణ చెయ్యడం జరిగింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ విపత్కర పరిస్థితుల్లో పని చేస్తున్న వీరు అంతా ఆరోగ్యంగా ఉండాలని ,వ్యాధి నిరోధక శక్తి పెంచే ఆయుష్ భారత్ సూచించిన ఈ కషాయం మంచిది అని తమ వంతు బాధ్యత గా మోడీ చాయ్ తయారు చేసి అధికారులకు ఇచ్చారు. బీజేపీ ఆధ్వర్యంలో పెద్దాపురం, సామర్లకోట పట్టణంలో కార్యాలయములలోని సిబంది అందరికి అంధిస్తామని తెలియచేసారు.ఈ కార్యక్రమంలో సామర్లకోట పట్టణ అధ్యక్షులు పెన్నాడ జగన్నాధ్, కర్రి ఆది నారాయణ రెడ్డి, చెరుకూరి రమేష్, మొదలైన వారు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి