మీ పాలన చరితార్థం ;;జగన్ మేధోమధనం లో ప్రశంసలు
తూర్పు గోదావరి ;;రాష్ట్రంలో గత ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో మరింత పటిష్టంగా పధకాలు అమలు చేయడానికి పధకాల పై మన పాలన మీ సూచనల కార్యక్రమం ప్రారంభ మైనది. ఈ రోజు సోమవారం నుండి ఈ నెల 30వ తేదీ వరకు జరుగు రాష్ట్ర, జిల్లా స్థాయిలో మేదో మధన సధస్సు కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా మంత్రులతో, కలక్టర్లతో మేదో మధన సదస్సు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన గ్రామ వాలంటీరు శ్రీమతి నాగలక్ష్మీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయము నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. శ్రీమతి నాగలక్ష్మీ మాట్లాడుతూ గ్రామ వాలంటరీగా సేవలు అందిస్తున్న ందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉందని తెలియజేసారు. వాలంటరీ హోదాలో ప్రజల ఇళ్లకు పోయి సమస్యలు వారి సమస్యలు తెలుసుకుని అవి పరిష్కరించే విధంగా చూడడం జరుగుతుందని ఆమె తెలిపారు. వాలంటరీ వ్యవస్థలో పనిచేయడం వల్ల ఎంతో సంతోషంగా ఉన్నామని, గతంలో ప్రైవేట్ ఉద్యోగంలో పొందని, మానసిక ఆనందాన్ని ఈ గ్రామ వాలంటీర్ పోస్టు ద్వారా పొందుతున్నామని ఆమె తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన సపోర్టుతో గ్రామ ప్రజలకు దగ్గరయ్యామని ఆమె తెలిపారు. ప్రతి నెల పింఛన్లు 1వ తేదీన తెల్లవారు జామున 4గంటల నుండి 6గంటల్లోనే పింఛన్లు అందించడం వల్ల వృద్ధులల్లో ఆనందాన్ని కళ్లారా చూస్తున్నామని చెప్పారు. కోవిడ్-19 కూడా నాలుగు సర్వేలు పూర్తి చేసామని మేము కరోనా పై భయపడ లేదని దానికి కారణం ముఖ్యమంత్రి ఇచ్చిన భరోసా అని ఆమె అన్నారు. కోవిడ్ - 19 లో సేవలు అందించుచున్న ఎఎఎమ్, ఆశా మరియు వాలంటీర్లకు 50లక్షలు భీమా కల్పించడం మాకెంతో ధైర్యం ఇచ్చిందని తన అభిప్రాయాన్ని వెల్లబుచ్చింది.
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మదర్ థెరిసా మహిళా సంఘ సభ్యురా లైన కుసుమ కుమారి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మదర్ థెరిసా మహిళా సంఘ సభ్యురా లైన కుసుమ కుమారి మాట్లాడుతూ కరోనా మహమ్మారి లాక్ డౌన్ సమయంలో 0 వడ్డీ కింద 22వేలు రూపాయలు మాగ్రూపుకు వచ్చిందని, ఈ సొమ్ముతో కష్టకాలంలో వున్న మాకు నిత్యవసర వస్తువులు కొనుగోలుకు ఎంతో ఉపయోగపడిందని తెలియజేసారు. ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు వాహనాలు ఏర్పాటు చేసి ఎంతో ఆదుకున్నారని, అదే విధంగా గుజరాత్ రాష్ట్రంలో రాష్ట్ర మత్స్యాకారులను మన రాష్ట్రానికి రప్పించడంలో ముఖ్యమంత్రి తీసుకున్న చొరవ రాష్ట్ర ప్రజలకు ఎంతో సంతోషాన్ని కల్పించిదని ఆమె తెలిపారు. వైజాగ్ విషవాయువు ప్రభావంతో చనిపోయిన వారి కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం అందించడం ముఖ్యమంత్రి చేసిన సహసోపేతమైన నిర్ణయమని తెలియజేసింది. నేను విన్నాను- నేను వున్నాను అనే నినాధంతో పాదయాత్రలో ప్రజల సమస్యలు పరిష్కరానికి మీరు చేస్తున్న కృషి ప్రజల ఎప్పటికి మరవలేరని ఆమె తెలిపారు. .
మద్యతరగతి కుటుంబాల మహిళలకు పసుపు, కుంకుమ పధకం ద్వారా ఎంతో మేలు చేస్తున్నారని ఆమె తెలియజేసారు. జిల్లా కలక్టర్ కార్యాలయంలోని వివేకానంద హాలు నుండి ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ, పి.గన్నవరం ఎమ్ఎ కె.చిట్టిబాబు, జిల్లా జాయింట్ కలక్టర్ (ఆర్) జి.లక్ష్మీశ, జిల్లా జాయింట్ కలక్టర్ (డబ్యూ) జ.రాజకుమారి, డిఆర్ సిహెచ్.సత్తిబాబు, జెడ్.పి సిఇఓ ఎమ్.జ్యోతి, కాకినాడ మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ ది స్కర్ పుండ్కర్, జిల్లా అధి కారులు, ఎమ్ పిడిఓలు, గ్రామసచివాలయాల సెక్రటరీలు, వాలంటీర్లు, లబ్దిదారులు, నిపుణులు, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి