మిర్చి రైతులు కష్టాన్ని  బుగ్గిపాలు చేస్తున్న కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యాలు  - బిజెపి రాష్ట్ర రైతు నాయకులు వై.వి.సుబ్బారావు .




.

 

అమరావతి / సత్తెనపల్లి : రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద శ్రీ వెంకటేశ్వర కోల్డ్ స్టోరేజ్ లో పరిసర గ్రామాల రైతులు తమ పొలాల్లో పండించిన సుమారుగా లక్ష క్వింటాలు మిరపకాయలను నిలువ ఉంచారని బిజెపి రాష్ట్ర రైతు నాయకులు వై. వి.సుబ్బారావు తెలిపారు. అయితే కోల్డ్ స్టోరేజ్ లో గత రెండు వారాలుగా ఏసీ లు పని చేయని కారణంగా, యాజమాన్యాలు నిర్లక్ష్యంగా ఉన్నందువలన దాదాపుగా 35 వేల క్వింటాలు మిరపకాయలు బూజు పట్టి పాడైపోయాయని, ఈ సంఖ్య రోజు గడిచే కొద్ది పెరుగుతుందని వై.వి.సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేసారు.  మిరప రైతులకు కనీసం సమాచారం ఇవ్వకుండా కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించి రైతులను మోసం చేసిందన్నారు. సమాచారం తెలుసుకున్న రైతులు గత మూడు రోజులు నుంచి స్టోరేజ్ లో మిర్చి టిక్కీలు బయటకు తీసుకువచ్చి అరపెట్టుకుంటున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆరుగాలం ఎండనక, వాననక కష్టపడి పనిచేసి, పెట్టుబడి కోసం అప్పులు చేసి మిరపకాయలు పండించి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకొని టిక్కీకి 400/- అద్దె చెల్లిస్తూ స్టోరేజ్ లో నిలువవుంచుకుంటే కనీసం కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం గా, భాద్యతారహిత్యంగా ఉంటే ఏలా అని ఎద్దేవా చేశారు.

                                      ఇప్పుడు కరోనా కష్ట కాలంలో కూడా రైతులు పొలాలకు వెళ్లి వారి ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ఇంతకాలం కష్ట పడి పనిచేసి పండించిన పంట చేతికి రాకుండా పోతుందని భయంతో పనిచేస్తూ, యావత్ ప్రపంచానికి అన్నదాత గా ఉంటున్నారని తెలిపారు.

కోల్డ్ స్టోరేజ్ లో ఒక్కొక్క మిరపకాయ టిక్కీ కి గుంటూరులో నే 100 నుండి 120 రూపాయలు చేస్తున్నారని, శ్రీ వెంకటేశ్వర కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం 400 రూపాయలు వసూలు చేస్తున్నారని రైతులు తెలిపారని, ఈ విషయాన్ని సంబంధిత అధికారులు దృష్టి కి తీసుకువెళ్లి, రైతులకు తగు న్యాయం చేస్తానని సుబ్బారావు తెలిపారు.                                                                                                                                                                                  నష్టపోయిన రైతులు మాకు న్యాయం చేయమని అడగగా స్టోరేజ్ యాజమాన్యం సరైన సమాధానం చెప్పకుండా వుంటున్నా పరిస్తితి ఉన్నదని ఆవేదన చెందారు. నష్ట పోయిన మిర్చి రైతుకు నష్ట పరిహారంగా 10 రెట్ల అధికంగా నష్ట పరిహారాన్ని కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం దగ్గర నుండి రైతులకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. దేశానికి వెన్నుముక అయిన రైతును మోసం చేస్తున్న వారికి  ఉరిశిక్ష కన్నా పెద్ద శిక్ష అమలు చేసేవిధంగా చట్టాలు సరి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇంకొక కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యాలు ఇలాంటి తప్పులు చేయాలంటేనే భయపడే విదంగా కఠినంగా శిక్షించాలని సుబ్బారావు డిమాండ్ చేశారు.

వీటితో పాటుగా అధికంగా చెల్లిచిన అద్దెను కూడా మిర్చి రైతులకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రైతులకు తగు న్యాయం చేయాలి అని అలాగే కోల్డ్ స్టోరేజ్ పై చట్ట పరమైన  చర్యలు తీసుకోవాలి అని బిజెపి రాష్ట్ర రైతు నాయకులు వై. వి.సుబ్బారావు  డిమాండ్ చేశారు.


 

 



 

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు