సగటు రైతు మేలు రైతు భరోసా ;మంత్రి పిల్లి
కాకినాడ ;;. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన వైఎస్ఆర్ రైతు భరోసా పధకం ద్వారా జిల్లాలో సగటు రైతుకు ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి సచివాలయం నుండి రెండవ విడత 2020-21 సంవత్సరానికి వైఎస్ఆర్ రైతు భరోసా - పి.యం కిసాన్ పధకం ప్రారంభించారు. ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, పార్లమెంట్ సభ్యులు వంగాగీత, చింత అనురాధలతో కలసి కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి తన కార్యాలయపు వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ ఈ పధకం కింద జిల్లాలో గత సంవత్సరం 4లక్షల 12వేల రైతు కుటుంబాలు 31 1.52 కోట్ల రూపాయలు ఆర్థిక లబ్దిని జమ చేయడం జరిగిందన్నారు. గత సంవత్సరం అర్హులైన ప్రతి కుటుంబానికి చెల్లించిన రూ. 13,500 లో భాగంగా జిల్లాలకు చెందిన కరప మండలం కంగోడు గ్రామం ఎస్.సి వర్గానికి చెందిన మెరక సత్యనారాయణ రెండు ఎకరాలు సొంతంగా వరి పండించుకోవడం జరిగిందన్నారు.
ప్రస్తుతం బొండాలు రకం వరిని పండించుకోవడం జరిగిందని కలక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సంవత్సరంలో గత సంవత్సరం కన్న అధికంగా 17 వేల 391 రైతు కుటుంబాలకు అదనంగా లబ్ది అందించడం ద్వారా రైతులు మరింతగా సంతోషంగా వ్యవసాయ పనులు చేసుకుంటున్నట్లు కలక్టర్ తెలిపారు. మెరక సత్యనారాయణ విజ్ఞాప్తి మేర కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ద్వారా రైతులు మెరక సత్యనారాయణ విజ్ఞాప్తి మేర కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా రైతు మెరక సత్యనారాయణ మాట్లాడుతూ షెడ్యూల్ కులాలకు చెందిన తాను కేవలం భూమినే నమ్ముకుని బతుకుతున్నానని, రైతు భరోసా పథకం ద్వారా గత సంవత్సరం ఇచ్చిన మొత్తం రూ. 13,500 లతో వరి పండించుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం బొండా రకం ధాన్యం పండిస్తున్నానని, రైతు భరోసా పధకం ద్వారా తనలాంటి పేద రైతులకు ముఖ్యంగా ఎస్.సి, ఎస్.టి, బిసి, మైనారిటీ రైతులకు ఎంతో ప్రయోజనకరం చేకూరుతుందన్నారు.
గతంలో అప్పులు చేసి పొలం పనులు చేసినప్పటికి సమాయానికి సాగునీరు, సరైనా విత్తనాలు దొరక్క తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురైయామన్నారు. ముఖ్యమంత్రిగా తమరు వచ్చిన తరువాత రైతులకు పగటిపూట 9గంటలకు కరెంటు అందించడం భూమి దున్నే ప్రతి రైతు హర్శిస్తున్నారన్నారు. పండించిన పంటను కొనుగోలు చేసే విధంగా గ్రామ స్థాయిలోనే ఏర్పాటు చేయడం లాంటి పనుల వలన నాలాంటి రైతులకు ఆర్థికంగా ఎంతో ప్రయోజకంగా ఉంటుంద్నారు. తమరు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఒక సంవత్సరమైన నేపద్యంలో ఈ నెల 30వ తేదీన రాష్ట్రంలోని అన్ని గ్రామాలతో పాటు మా గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో మేలు జరుగుతుందన్నారు. అదే విధంగా నవరత్నాల్లో భాగంగా అమ్మ ఒడి పథకం ద్వారా తమ పిల్లలకు ఆర్థిక లబ్ది చేకూరిందని, ముఖ్యమంత్రిగా తమరు పేదలకు సంక్షేమానికి అందిస్తూన్నాపధకాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని రైతు సత్యనారాయణ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా వైఎస్.జగన్మోహన్ రెడ్డి లబ్దిదారులకు రాసిన లేఖను ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎం.పిలు వంగా గీతా, చింతా అనురాధ, కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలక్టర్ జి.లక్ష్మీశ, డిఆర్ ఓ సిహెచ్.సత్తిబాబు, పెద్దాపురం, రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం నియోజక వర్గాల ప్రతినిధులు దవులూరి దొరబాబు, ఆకుల వీర్రాజు, వ్యవసాయశాఖ జెడి. కె.ఎస్.వి.ప్రసాద్, లబ్దిదారులైన రైతు ప్రతినిధులు, వ్యవసాయ అనుబంధ శాఖాధికారులు పాల్గొన్నారు. ( సమాచార శాఖచే జారీ)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి