కాకినాడ ; షాపు లన్ని తెరుచుకోవచ్చు... కమీషనర్

  కాకినాడ ;   కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్  కె.రమేష్  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు విడుదల చేసిన covid 19 ఇన్స్టంట్ ఆర్డర్ 48 అనుసరించి నగరపాలక సంస్థ పరిధిలో గల వ్యాపార సంస్థలు అన్నీ కూడా వారి షాపులను ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తెరిచి ఉండవలెనని ఆదేశాలు జారీ చేసియున్నారు. అదే విధంగా రెడ్ జోన్ వున్న ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి వ్యాపార లావాదేవీలు, షాపులు తెరిచి ఉంచడం జరగకూడదని, ఇతర ప్రాంతాల్లో అత్యవసర సరుకుల విక్రయ దుకాణాలు మాత్రమే తెరిచి ఉంచాలని మరియు మందుల షాపులను తెరిచి ఉంచుకోవచ్చని తెలియజేయుచున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో కాయగూరల దుకాణములు మరియు నిత్యవసర దుకాణములు వారు మాత్రమే ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంచాలని, లేనియెడల చట్టరీత్యా చర్యలు కొనసాగుతాయని తెలియజేయడమైనది.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు