బియ్యం కార్డులు పునః పరిశీలన వెంటనే పూర్తి చేయాలి

జిల్లాలో  పెండింగ్ లో ఉన్న బియ్యం కార్డులు పునః పరిశీలన వెంటనే పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ డా.జి.లక్ష్మీ శ ఆదేశించారు.


ఆదివారం కాకినాడ  అర్బన్ రామారావు పేట, కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామ/వార్డు సచివాలయాల్లో బియ్యం కార్డుల రీ సర్వే ప్రక్రియ ఏవిధంగా జరుగుతుందో జెసి, పౌరసరఫరాల అధికారులతో అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జి.లక్ష్మీశ  మాట్లాడుతూ జిల్లాలో 16 లక్షల,50 వేల,610 బియ్యం కార్డులకు గాను1 లక్ష 6 వేలు,50 బియ్యం కార్డులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. వీటికి సంబంధించి రీ సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. బియ్యం కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో వ్యక్తిగత కార్లు, అధిక కరెంటు బిల్లు, భూమి, ఆదాయపు పన్ను, ప్రభుత్వ ఉద్యోగులు తదితర అంశాల కారణంగా బియ్యం కార్డులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఈ సర్వేలో అర్హత సాధించిన వారందరికీ వెంటనే బియ్యం కార్డులు మంజూరు చేయడం జరుగుతుందని జెసి తెలిపారు. బియ్యం కార్డుల రీ సర్వే కి సంబంధించి డేటా ఎంట్రి వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. గ్రామ/ వార్డు వాలంటరీలు బియ్యం కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుని వద్దకు నేరుగా వెళ్లి వివరాలు  సేకరించి,వాటి వివరాలు గ్రామ సచివాలయం అయితే వి ఆర్ వో లాగిన్ లోనూ, వార్డు సచివాలయం అయితే వార్డు అడ్మిన్ లాగిన్ లో అప్లోడ్ చేయాలని జెసి తెలిపారు.


  అనంతరం బియ్యం కార్డులు రీ సర్వే ప్రక్రియ గ్రామ /వార్డు సచివాలయాల్లో ఏ విధంగా జరుగుతుందో కాకినాడ అర్బన్ పరిధిలో రామారావు పేట వద్ద నున్న 4 వ వార్డు సచివాలయం కు సంబంధించి మజ్జి.నాగమణి, కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామ సచివాలయం సంబంధించి సిహెచ్.చండీరాణి గృహాల వద్ద కు జెసి నేరుగా వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు.


   ఈ కార్యక్రమంలో జెసి వెంబడి జిల్లా పౌర సరఫరాల అధికారి పి ప్రసాద్ బాబు, ఏ ఎస్ ఓ సురేష్,ఎమ్ ఎస్ వో లు మురళీకృష్ణ ఆనంద్, మురార్జీ,గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు