సారా బట్టిలపై ఎక్సైజ్ దాడులు

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ  ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గోకవరం మరియు సీతానగరం మండలాలలో కోరుకొండ ఎక్సైజ్ సీఐ కె వీరబాబు ఆధ్వర్యంలో విస్తృతంగా దాడులు నిర్వహించారు ఈ దాడులలో గోకవరం మండలం  లోని తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన యర్రాచక్రధర్ వద్ద  10 లీటర్ల సారా, అదే గ్రామానికి చెందిన చెల్లుబోయిన నాగేశ్వరరావు వద్దనుండి ఇ ఐదు లీటర్ల సారా అరెస్ట్ అరెస్టు చేయడం జరిగిందని ఎక్సైజ్ సీఐ వీరబాబు  తెలిపారు. సీతానగరం మండలం పరిధి లోని ముని కొడవలి ముగ్గళ్ళ గ్రామ సమీపంలో గోదావరి లంకల్లో ఏడు వేల లీటర్ల పులిసిన బెల్లపు ఊటలను, సారా బట్టీలను ధ్వంసం చేయడం జరిగిందని అన్నారు. ఈ సారా బట్టీలునిర్వహిస్తున్న బొబ్బిల్లంక కు చెందిన చేబ్రోలు అంజి, మునికొడవలి కిచెందిన రాపాక అనిల్ కుమార్ లపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం జరుగుతుందని ఎక్సైజ్ సీఐ కె. వీరబాబు తెలిపారు


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు