డి-ఎడిక్షన్ సెంటర్లలో నియమింపబడిన డాక్టర్లు, కౌన్సలర్లు, ఎఎన్ఎమ్, ఇతర సిబ్బంది సేవా భావంతో విధులు నిర్వహించాలి
తూర్పుగోదావరి ;;జిల్లాలో డి-ఎడిక్షన్ సెంటర్లలో నియమింపబడిన డాక్టర్లు, కౌన్సలర్లు, ఎఎన్ఎమ్, ఇతర సిబ్బంది సేవా భావంతో విధులు నిర్వర్తించాలని జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. బుధ వారం కాకినాడ కలక్టర్ కార్యాలయం విధాన గౌతమి హాలు నందు డి-ఎడిక్షన్ సెంటర్లలో అవసరమైన వైద్య సిబ్బందికి సంబంధించి ఇటర్యూలు నిర్వహించి, అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో రెండు డి-ఎడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సెంటర్లలో విధులు నిర్వర్తించే ందుకు గాను అవసరమైన సిబ్బంది నియమించడం జరిగిందన్నారు. మద్యవర్తులు, దళారులను నమ్మి మోసపోవద్దని ఈ ఉద్యోగాలు పారదర్శకంగా పూర్తి మెరిట్ ఆధారంగా ఎంపిక జరిగిందన్నారు. జిల్లాలో డి-ఎడిక్షన్ సెంటర్లలో నియమింపబడిన డాక్టర్లు, కౌన్సలర్లు, ఎఎన్ఎమ్, ఇతర సిబ్బంది సేవా భావం, నిజాయితీతో విధులు నిర్వర్తించాలని కలక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దశల వారిగా మద్యాన్ని నిషేదించడంతో మద్యానికి బానిస అయిన వారు, మానసిక సమస్యలతో బాధపడే వారు ఈ సెంటర్లకు రావడం జరుగుతుందన్నారు. మానసిక పరిస్థితులను అర్థం చేసుకుని వారికి వైద్యం అందించాలని కలక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెసి(డి) కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లో డి-ఎడిక్షన్ సెంటర్లలో నియమింపబడిన డాక్టర్లు, కౌన్సలర్లు, ఎఎన్ఎమ్, ఇతర సిబ్బంది ఒక సంవత్సర కాల కాంట్రాక్ట్ పద్దతిలో నియమించడం జరిగిందన్నారు. డాక్టర్లు-2, కౌన్సలర్లు-6, ఎఎన్ఎమ్-6, వార్డు బాయ్ -4, డేటా ఎంట్రీ-2, మరియు కోవిడ్ - 19 ఆసుపత్రిలో ఎన్ స్టీయా టెక్నిషియన్స్-6 పోస్టులు భర్తీ చేయడం జరిగిందన్నారు. అనంతరం కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి, జెసి(డి) కీర్తి చేకూరి ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో డిఎమ్ అండ్ హెచ్ ఓ డా.బి.సత్యసుశీల, జీజీ హెచ్ సూపరింటెండెంట్ డా.ఎమ్.రాఘవేంద్రరావు, ఆర్ఎమ్ సి ప్రిన్సిపల్ డా.బాబ్ది, డిసి హెచ్ ఎస్ డా.రమేష్ కిషోర్, ఇతర అధి కారులు, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి