పోస్టుల భర్తీలో మోసపోవద్దు

తూర్పు గోదావరి ;;రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కోవిడ్-19 ఆసుపత్రులలో స్టాఫ్ నర్స్, లాబ్ టెక్నీషియన్, యం.ఎన్.ఓ., యఫ్.ఎన్.ఓ., స్వీపర్ పోస్టులను భర్తీ చేయనున్నామనీ, ఈ విషయంలో దళారులను ఎవరినీ నమ్మి మోసపోవద్దని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.బి.సత్య సుశీల గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. డా.బి.సత్య సుశీల గారు మాట్లాడుతూ ఈ నియామకాలు పూర్తిగా మెరిట్ మరియు రోష్టర్ ప్రాతిపదికన పారదర్శకంగా జరుగుతాయని, ఎటువంటి పైరవీలకు తావులేదని తెలియచేసారు. బయటి వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దని ,ఎవరికీ ఏ విధమైన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎవ్వరైన పైరవీలు చేసినా, డబ్బులు అడిగినా జిల్లా కలక్టరు వారికి గాని లేదా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారికి గాని ఫిర్యాదు చేయాలని కోరారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు