ఆందోళన వద్దు ;; కరోనా పట్ల అప్రమత్తత అవసరం
జిల్లాలో కరోన వైరస్ పట్ల ప్రజలు ఆందోళన విడిచిపెట్టి అప్రమత్తతతో ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖామంత్రి పిల్లిసుభాష్ చంద్రబోస్ అన్నారు. శుక్రవారం కలక్టర్ కార్యాలయం లో కలక్టర్ తో కలిసి ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ కొంత కాలం కోవిడ్ తో కలిసి జీవించవల్సిన పరిస్ధితి ప్రపంచ వ్యాప్తంగా ఉందని, ఈ పరిస్ధితుల్లోకొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే కరోన సోకకుండా ఉంటుందని ఆయన అన్నారు. తూర్పుగోదావరి ;;ఈ నెల 25 నుండి ఈ రోజు వరకు పరిపాలన, అభివృధ్ధి, వ్యవసాయ, విద్య, పరిశ్రమలు, ఆరోగ్యం తదితర శాఖల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన పాలన- మీ సూచన కార్యక్రమం ద్వారా వివిధ శాఖల పని తీరు గురించి, చేయవల్సిన కార్యక్రమాల గురించి రాష్ట్ర స్ధాయిలో, జిల్లా స్ధాయిలో మేధోమధనం కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లా స్ధాయిలో ప్రతీ రోజు ఆ శాఖకు సంబంధించిన అధికారులతో , నిష్ణాతులతో అర్ధవంతమైన చర్చలు జరిగాయన్నారు. చర్చలను ఒక నివేదిక రూపంలో తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం కోవిడ్ నియంత్రణలో తీసుకుంటున్న చర్యల గురించి మంత్రి జిల్లా కలక్టర్ ను, అధికారులను అభినందించారు.
జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా లో కోవిడ్ నియంత్రణ గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. జిల్లాలో జి.మామిడాడలో ఒక వ్యక్తి వలన వ్యాధి ప్రబలిందని, దానికి కారణం ప్రజల అజాగ్రత్తేనని అన్నారు. ప్రస్తుతం కరోన వైరస్ ఆ గ్రామంలోనే ఉన్నదని, ప్రక్కగ్రామాలకు సోకకుండా పరడ్బంది చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జి.మామిడాడలో తీసుకున్న చర్యల గురించి ఆయన మాట్లాడుతూ రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక సిబ్బంది, సివిల్ సప్లయిస్, శానిటేషన్, సాంఘిక సంక్షేమం, వైద్య అధికారులతో కలిపి ఒక అధికార బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింగన్నారు. వారు నిరంతరం పర్యవేక్షిస్తారని అన్నారు. జి.మామిడాడలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చేసినట్లు తెలిపారు. ఎవరైన కోవిడ్ లక్షణాలు కన్పిస్తే స్వఛ్ఛందంగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఒక వ్యక్తికి కోవిడ్ వస్తే సామాజికంగా అతనిని వివక్షతతో చూడరారదని, ఒక వ్యధిలాగనే వచ్చి అది పోతుందని కలక్టర్ తెలిపారు. ప్రత్యేకాధికారిని నియమించడం జరిగిందని అన్నారు. జిల్లాలో జి.మామిడాడ తప్పితే ఏ ప్రాంతం నుండి క్రొత్త కేసులు లేవలని అన్నారు. క్రొత్త ప్రోటోకాల్ ప్రకారం హోమ్ క్వారంటైన్ కు అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. కరోన వ్యాధి గురించి ఆదోళన చెందవల్సిన అవసరరం లేదని అ న్నారు. మాస్క్, భౌతిక దూరం పాటించడం మరియు చేతులను పరిశుభ్రంగా సబ్బుతో కడుగుకుంటే సరిపోతుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 45,338 కరోన వ్యధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 201 పాజిటివ్ కేసులుగా నిర్ధారణయ్యాయన్నారు. ప్రస్తుతం 142 యాక్టివ్ కేసులు ఉన్నాయని, 56 మంది కోవిడ్ నుండి కోలుకుని డిస్చారయ్యారన్నారు. జిల్లాలో కోవిడ్ తో పాటు సిజనల్ వ్యాధులను కూడా నియంత్రించుటకు చర్యలు తీసుకొనుచున్నట్లు కలక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో జాయింట్ కలక్టర్ (ఆర్) లక్ష్మిశ, జేసి(డి) కీర్తి చేకూరి, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్.సత్తిబాబు, ట్రైనీ కలక్టర్ అపరాజిత్, డిఎంహెచ్ఓ డా.బి.సత్యసుశీల తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి , కలక్టర్ హోమ్ క్వారంటైన్ లో ఇచ్చుటకు ఆరోగ్య శాఖకు అందజేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి