సచివాలయ ప్రతిపాదనలు సిద్ద్ధం చేయండి

తూ . గో ;;జిల్లాలో కొత్తగా నిర్మించనున్న 748 గ్రామ సచివాలయాలకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలక్టర్ తన కార్యాలయం నుండి జెసి లక్ష్మీశతో కలిసి క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ గ్రామ సచివాలయాలకు అనుసందానంగా వైఎస్ ఆర్ హెల్త్ సెంటర్, రైతు భరోసా కేంద్రాలు నిర్మించే విధంగా ప్రతిపాదనలు పంపాలన్నారు. ప్రభుత్వం ప్రతి గ్రామ సచివాలయం వద్ద వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లతో పాటు రైతు భరోసా కేంద్రం నిర్మించే విధంగా సంకల్పించినందున తగిన విధంగా ప్రతిపాదనలు పంపాలన్నారు. జిల్లాలో ఉపాధి హామీ పధకం కింద రోజుకు లక్ష 73వేల మంది పని చేస్తునట్లు పనిచేసే చోట్ల చేతులు శుభ్రం చేసుకోవడం, సామాజికదూరం పాటించడంతో పాటు మాస్కు ధరించడం చేయాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఫీల్డ్ అసిస్టెంట్ ను తొలగించడం జరుగుతుంన్నారు. జిల్లాలో చేపట్టిన నాడు- నేడు పాఠశాల విద్యార్థులు స్ఫూర్తి పొందే విధంగా పనులు చేపట్టాలన్నారు. నాడు - నేడు పనులను ఎమ్.పి.డి.ఓలు పర్యావేక్షణ చేయాలని కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. జాయింట్ కలక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ నవరత్నాలు, పేదలకు ఇళ్లు భాగంగా సేకరించిన భూమిని ఎమ్.పిడి ఓలకు బదలి చేయాలన్నారు. లేఅవుట్ ప్రక్రియ వేగవంతం చేసి గృహనిర్మాణ లబ్దిదారులకు గృహాలు నిర్మించుకునే విధంగా ఏర్పాటు చేయాలని జెసి తెలిపారు. ఈ సమావేశంలో జెసి-2 జ.రాజకుమారి, డిఆర్ ఓ సిహెచ్.సత్తిబాబు, డ్వామా పిడి యం.శ్యామల, హౌసింగ్ పిడి వీరేశ్వర ప్రసాద్, డిఇఓ ఎస్.అబ్రహమ్, ఎస్ఎస్ఎ పిఓ విజయభాస్కర్, కాకినాడ మున్సిపల్ కమీషనర్ కె.రమేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ( సమాచార శాఖచే జారీ)


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు