వడ్డీ పెరగదు ;;రైతులు ఆందోళన పడొద్దు
జిల్లాలో చాల చోట్ల రైతులు తీసుకున్న పంట రుణాలు సకాలం(ఋణం తీసుకొన్న సంవత్సరం లోపు) లో చెల్లించక పోతే వడ్డీ పెరుగుతుందని పత్రికలలో వార్తలు రావటం వలన చాలా మంది రైతులు ఆందోళన చెందుతున్నారని తెలియవచ్చినది. రైతులందరూ ఏమాత్రం ఆందోళన చెందవద్దని, రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా వారు పంట రుణాల, టర్మ్ రుణాల వాయిదాలు 3 నెలల కాలం పొడిగించడం జరిగింది. ఈ విధముగా మూడు నెలల కాలం చెల్లించక పోవడం వల్ల ఏ విధమైన అపరాధ రుసుమును బ్యాంక్ వారు రైతులపై మోపడం జరగదు. అలాగే ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రాయితీ కూడా వర్తిస్తుంది. పంట రుణాలు తీసుకొని మార్చి ఆఖరకు ఏడాది దాటినా ఏప్రిల్, మే నెలలకూ వడ్డీ రాయితీ వర్తింపజేయాలని కేంద్రం స్పష్టం చేసింది. కనుక పంట రుణాలు తీసుకున్న రైతులు ఆందోళన చెందవద్దని , ఇంకా బ్యాంకు ల నుండి ఏదైనా వత్తిడి వచ్చిన పై విషయం తెలియచేయ గలరని. ఇంకా ఏదైనా ఇబ్బందులు కలిగించినచో ఆయా మండల వ్య్వసాయాధికార్లను, సహాయ సంచాలకులను మరియు జిల్లా లీడ్ మేనేజెర్ ను( ఫోన్ నెం.9440908845) సంప్రదించ వలసినదిగా జిల్లా వ్వవసాయ సంచాలకులు శ్రీ కె.ఎస్వీ.ప్రసాద్ గారు తెలియచేయడమైనది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి